Gang Leader (1991)

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: విజయబాపిణీడు
నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
విడుదల తేది: 09.05.1991

చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా
పాపా రీటా హా  ఆపెయ్ వేట హొ
ఆడితే ఆట హా హా ఇస్తా కోటా హా
G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader…

షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప
రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప
హు హు హు హు హు
కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే

G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader…

చరణం: 1
బ్రహ్మ రాతని డుబబ్బాబబ కృష్ణగీతని డుబబ్బాబబ
మళ్ళీ రాస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు
స్వర్ణయుగంలో డుబబ్బాబబ స్వర్గసుఖాన్ని డుబబ్బాబబ
మళ్ళీ తెస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హా
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే
G A N G  Gang Gang బజావో Bang Bang
Gang Leader…

చరణం: 2
ఆవేశంలో డుబబ్బాబబ భగత్ సింగ్ కి డుబబ్బాబబ
భక్తుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఆలోచనలో డుబబ్బాబబ సుభాష్ బోస్ కి డుబబ్బాబబ
శిష్యుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హాహా
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా

G A N G  Gang Gang బజావో Bang Bang యహ్
Gang Leader…

*******   ********   **********

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా…
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం: 1
ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో
జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి ఛం ఛమాఛం వాటేశారో

హోయ్ హోయ్ హోయ్ ధం ధమాధం దుప్పట్లో
ధన్ ధనాధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి ఛం ఛమాఛం పోతుందమ్మో

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా
టప్పు టప్పు
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా
హోయ్ టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి హోయ్
టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

చరణం: 2
హొయ్ హోయ్ వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా
వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్న మతే పోయిందిరో

అరెరెరె… సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే
నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యో

అరెరెరెరె… టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
ఓ టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా…
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా…

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

*******   ********   **********

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పాలబుగ్గా… ఇదిగో పట్టు
ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు
జారేపైటా… చప్పున పట్టు
దక్కాలంటే… తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా
కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా
ఐ లవ్ యూ నా మంత్రం…

చరణం: 1
కంట్లో కథేమిటంట ఒంట్లో కసేమిటింట ఎత్తేయ్ బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసట
పిల్లా సరేను అంటే మళ్లీ సరాగమంటా లాగించు ముచ్చట
ఈడే విలాసమంటా తోడై కులాసగుంటా సిగ్గే చిటపట

హా… హా… హా… హో… హే… హే… హా… హా…

తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యూ నా మంత్రం…

పాలబుగ్గా… ఇదిగో పట్టు
ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు
జారేపైటా… చప్పున పట్టు
దక్కాలంటే… తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

చరణం: 2
నాలో వసంతగాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా
ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా
నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా
షోకే సలాము చేసే నీకే గులాముకాని దమ్మే దండగ

హా… హా… హా… హో… హే… హే… హా… హా…

తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా
ఐ లవ్ యూ మన మంత్రం…

పాలబుగ్గా… ఇదిగో పట్టు
హా ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు
జారేపైటా… చప్పున పట్టు
ఓ దక్కాలంటే… తాళిని కట్టు
హోయ్ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

*******   ********   **********

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చరణం: 1
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే
కొండాకోన తుళ్లిపోయే

చరణం: 2
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి

వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

లాలా లాలా లాలా లాలా ఆ…
లాలా లాలా లాలా లాలా ఓ…
లాలా లాలా లాలా…

*******   ********   **********

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం

చరణం: 1
ఉదయం చుంబన సేవనం
మద్యాహ్నం కౌగిళి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం
రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం
తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం
మరెందుకాలస్యం
నయమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

చరణం: 2
నీవేలేని నేనట నీరేలేని యేరట కాలాలన్నీ కౌగిట
మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన
అమాస వెన్నెలలో
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురలయ లావణి పలికిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

********    *********   ***********

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ
అరె హా…హా…
ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా… (2)
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా
లవ్వాడమన్నాను రా…
నా రాజా రా ఇటు రా… (2)

పని సాసస మ్మ్ హుఁ హుఁ
పని సాసస హహ హాహహా
సగ మామమ హేహె హెహెహే
సగ మామమ ఓహొహో
అరె హా…హా…

చరణం: 1
బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో
మన మధ్య తడికెందుకంట… బావోయ్…
ముద్దుల్లో ముంచెత్తమంట
హాయ్…గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో
నసమాని దయచేయమంట… పిల్లా…
నువ్వంటే నాకొళ్ళు మంట
అదిగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క

అరె హా…హా…
పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ
అరె హా…హా…యా
ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా…
నా రాజా రా ఇటు రా రా…

చరణం: 2
ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో…
ఒళ్ళంతా సెగలే బావయ్యో…

హోయ్… ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా
నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో…
అయ్యో రాత వినవా గీత
ఆపెయ్ మోత పెడతా వాత
అరె హా…హా…

చక చాచచ మ్మ్ హుఁ హుఁ
చక చాచచ హహ హాహహా
ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా
తుతు తూతుతు హహ హాహ
అరె హ హ హ హ హ హ హాహా

ఆ సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా
నా రాజా రా ఇటు రా…(2)
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా
లవ్వాడుమన్నాను రా…
నా రాజా రా ఇటు రా… (2)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Thali (1997)
error: Content is protected !!