చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి.బి. చరణ్ , మాళవిక
నటీనటులు: అల్లు అర్జున్, అదితి అగర్వాల్
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 28.03.2003
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని…
అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లల లాలాల లల లాలాల లాలాల లాలాల
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
చరణం: 1
ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో…
దేవుడు చల్లగ చూడాలి…
ఆ పువ్వుకు పూజలు చేయాలి…
దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే… హాయిగ ఉండాలి
లల లాలాల లల లాలాల లాలాల లాలాల
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
చరణం: 2
నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా…
దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా
మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం…
ఎన్నడు వాడదుగా
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లల లాలాల లల లాలాల లాలాల లాలాల
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి.బి. చరణ్ , మాళవిక
లాలలలాల లాలలలాల లాలలాలాలా లల లాలా లాలా
లల లాలా లాలా లాలా లాలా లా
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా…
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
చరణం: 1
ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని
రుచి చూసిన కాకెంగిళ్లే అభిరుచులను కలుపుతాయని
తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని
మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని
లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిశాకా…
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
చరణం: 2
ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకినీ పంపుతాయనీ
రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ
ఆ బొమ్మల పెళ్లిళ్లే ఆశీస్సులు తెలుపుతాయనీ
తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలిశాకా…
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
లాలలలాల లాలలలాల లాలలాలాలా (2)
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కౌశల్య
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేం కావాలి నిదరోతూ ఉంటే తను పక్క నుండాలి…
ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంటా
గరిసని సమ గరిసా (2)
సగమ నినిప మగమా (2)
పాపా మగమామా గసగాగా సనిసా (2)
చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగేవేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవునిదిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంటా
ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మ నవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వ నవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కి ఏడ్చేవేళ కన్నీళ్ళవుతా
నేస్తాన్నవుతా గురువు అవుతా పనిమనిషి తనమనిషవుతా
నే చెప్పే ప్రతిమాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సిమ్మాద్రి పాట మనసారా వినమంట
తన తియ్యని పాటే అమ్మ పాడేలాలీ
తనతోడే ఉంటే అది దీపావళీ
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సిమ్మాద్రి పాట మనసారా వినమంట
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బి.చరణ్ , సునీత
ధింతననన ధింతన ధింతన (4)
గంగా…
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా
గంగా… నిజంగా…
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నువ్విచ్చిన మనసే క్షేమం
నువ్వు పంచిన ప్రేమే క్షేమం
నువ్వయి నేనున్నాను క్షేమంగా
మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడినమాటలు సౌఖ్యం
మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా
నీ చెవి వినని ఈ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతిపదమున నువ్వు ప్రత్యక్షం
శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా… నిజంగా…
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నువు పంపిన జాబుల పూలు
నా సిగలో జాజులుకాగా
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా… నిజంగా…
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
ధింతననన ధింతన ధింతన (8)
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: గంగ , కల్పన, యమ్.యమ్.కీరవాణిి, శ్రీవర్ధిని
ఓం… ఓం… ఓం…
జీవన వాహినీ… పావనీ…
కలియుగమున కల్పతరువు నీడ నీవనీ
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము గూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మా సకల లోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరిగు శుభగాత్రీ
గంగోత్రి… గంగోత్రి…
గంగోత్రి… గంగోత్రి…
గల గల గల గంగోత్రి హిమగిరి జని హరి పుత్రి (5)
జీవన వాహినీ… పావనీ…
మంచుకొండలో ఒక కొండవాగులా
ఇల జననమొందిన విరజా వాహినీ…
సససరిసరి గరిగమగమ దప దప దప దప గరి సరి సరి సరి
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సుర గంగ నీవనీ
సానిదగరిసనిదపమగరి సరి సరి గమ గమ గరిస
అత్తింటికి సిరుల నొసగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరధీవై
బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణి కర్ణిక
తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి… గంగోత్రి
గంగోత్రి… గంగోత్రి….
గల గల గల గంగోత్రి హిమగిరి జని హరిపుత్రి (5)
పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం
అమ్మా… గంగమ్మా… కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పామ్మా సాయమునకు వెనకాడొద్దనీ
గోదారికీ కావేరీకి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా
జీవ నదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా
శివుని జటలనే తన నాట్య జతులుగా జలక మాడు సతులకు సౌభాగ్య దాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా
జలదీవెన తలకుపోసే జననీ గంగాభవాని
ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ గంగోత్రి… గంగోత్రి
గంగోత్రి… గంగోత్రి…
గల గల గల గంగోత్రి హిమగిరి జని హరిపుత్రి (5)
జీవన వాహినీ… పావనీ…
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: డి.ఐశ్వర్య , యస్.పి.బి.చరణ్, శ్రీవర్ధిని
కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్
క్కు క్కు క్కు… గంగోత్రి…
(కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్)
రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ
కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్
సరిగమ సరిగమ సరిగమ పదనిస
రైలుబండి రైలుబండి నడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ
కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్
తకదిమి తకదిమి తకదిమి తకజణు
అలసటే లేని సంగీతాన్ని వినిపిస్తుందండి
మనుషుల మధ్య దురాలన్ని చెరిపేస్తుందీ రైలుబండి
(కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ )
క్కు క్కు క్కు… గంగోత్రి…
కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ
కర్ణాటక పిసిపేలా బాత్ తినిపిస్తుందండీ
కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్
ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా పార్శిల్ కట్టించి
మహారాష్ట్రాలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది
కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్
ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి
హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పించి
గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది
క్కు క్కు క్కు… గంగోత్రి…
(కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్)
ఎండల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి
వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ…
కో: చిక్ బుక్, చిక్ బుక్, చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్
రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ
అమ్మల్లే మనకూయలలుపి జోకొడుతుందండీ
కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్
సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ
అందరి భారం మోసేస్తూ కోరిన తీరం చేరుస్తూ
మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ
మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ
(కో: చిక్ చిక్ బుక్ బుక్, చిక్ చిక్ బుక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్, చిక్ బుక్ చిక్ బుక్)
క్కు క్కు క్కు… గంగోత్రి…
రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ
కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్
రైలుబండి రైలుబండి కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ
కో: చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్
********* ********* *********
చిత్రం: గంగోత్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో (నాగూర్ బాబు), సునీత
మ్మ మ్మ మ్మ మ్మ మ్మ…మ్మ…మ్మ…మ్మ
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు (2)
మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ
మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు
మావయ్యా… మా నాన్నా…
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
పిపి పీపీ పి పి పి పి పిల్లా నిను మెప్పిస్తానే నీ పెద్దళ్ళోను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే
కో: డుంబారే డుంబ డుండుం డంబారే డంబ డండం
నేనేమో మాష్టర్ ని నువ్వేమో స్టూడెంట్ వి
ఇద్దరికి కుదిరేనే పిల్లా మన కధ సుందరకాండేనే పిల్లోయ్
పాఠాలే వినకున్నా ప్రయివేట్ కి రాకున్నా బెత్తంతో కొట్టొద్దోయ్ సారూ
కొడితె మెత్తంగా కొట్టాలొయ్ సారూ
బెంచి మీద నిలబెట్టను, గోడకుర్చీ వేయించను నా ఒళ్లో కూర్చోవే పిల్లా
నీకిక వంద మార్కులేస్తానేపిల్లా ఉఁమ్మా…
కో: మాష్టారూ…మాష్టారూ…నీకెందుకు ఈ పాడు బుద్దులు
కో: పెద్దోళ్ళకి తెలిసిందా అవుతుంది నీ బాక్సు బద్దలు
మ్మ మ్మ మ్మ మ్మ మ్మ…మ్మ…మ్మ…మ్మ మావయ్యది మొగల్తూరు
మీ నాన్నది పాలకొల్లు నాకు తెలుసు…
కో: హైస్సా హైస్సా హైస్సా హైస్సా
నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారూ
నీకు పెనిమిటి నేనవుతానోయ్ సారూ
అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటే అన్నిటికి ఓకేనే పిల్లా
అటు ఇటు అయినా పర్లేదే పిల్లా
నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో కధ అడ్డం తిరుగుతుంది సారూ
ఆపై నీ కడుపే పండుతుంది సారూ
కో: మాష్టారూ… మాష్టారు… స్టూడెంట్ మీకు కాదు జోడు
కో: మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫ్ఫాడిస్తాడు
మ్మ మ్మ మ్మ మ్మ మ్మ…మ్మ…మ్మ…మ్మ
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
కో: డుంబారే డుంబ డుండుం డంబారే డంబ డండం (2)