Geethanjali (1989)

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు
నటీనటులు: నాగార్జున, గిరిజా షెట్టర్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: సి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్, సి.యల్. నరసా రెడ్డి
విడుదల తేది: 10.05.1989

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

నా…జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ… సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి

ఓ… మేఘమా ఉరమకే ఈ పూటకీ
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ… కోయిలా పాడవే నా పాటని
తియ్యని తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో
సెలయేరుల అలపాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

*********  *********  *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర ,  యస్. పి. బాలు

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏలగాని నీడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే

నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాదలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ ఈ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి ప్రశ్న రాసలీలకి
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అణాలు ఆశకి తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీకసి
నింగీ నేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బందనం
ప్రేమకే జయం ప్రేమదే జయం

*********  *********  *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో… హే హే
మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీ ఆటలో

నేడేరా నీకు నేస్తము, రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా, రానే రాదూ
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే
తక తకధిమి తకఝణు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

పడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే… హో..హో
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే

ఓ మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే
తక తకధిమి తకఝణు

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం

మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తకిట తకధిమి తకధిమి తక
తకిట తాం తాం తాం తాం తాం

*********  *********  *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా (2)

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల నా యెద స్వరాల సంపద
తరాల నా కథ  క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేననీ…

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో

శుఖాలతో పికాలతో ధ్వనించినా మధూదయం
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేననీ…

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా (2)

**********   *********   *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, జానకి

ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో…
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో…

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం

ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ
నా హృదయం కనులు తడిసే వేళలో…
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో…

**********   *********   *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం: 1
వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం: 2
సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు  ఉడుకు వయసు
దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే
ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

**********   **********  *********

చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ…ఓ…ఓ…ఓ…
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
నా ఊరేది… ఏది,  నా పేరేది… ఏది
నా దారేది… ఏది,  నా వారేరి…
ఓ…ఓ…ఓ…ఓ…

ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నుడుగు
మోహిని పిచాసి నా చెలిలే
శాఖిని విసూచి నా సఖిలే
మోహిని పిచాసి నా చెలిలే
శాఖిని విసూచి నా సఖిలే
విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీదా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ భేతాళ
మారి జంభం జదంభంభం

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా

నీ కబళం పడతా నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా నిను పట్టుకు పోతా
ఆ…ఆ… ఓ… ఓ…

ఢాకిరి ఢక్కా ముక్కల చక్కా ఢంభో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటను వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్
నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కిస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్
తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
అస్త్రాయా ఫట్  ఫట్ ఫట్ ఫట్
వస్త్రాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్

భూపోల మసజస తతగా శార్దూలా

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా

నీ కబళం పెడతా నిను కట్టుకు పోతా
నీ భరతం పెడతా నిను పట్టుకు పోతా
ఎ… ఎ… ఏ… ఏ…

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో