Ghajini (2005)

చిత్రం: గజిని (2005)
సంగీతం: హారీస్-జయరాజ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ
నటీనటులు: సూర్య, అసీన్, నయనతార
దర్శకత్వం: ఏ. ఆర్.మురగదాస్
నిర్మాత: సలీం ఏ.చంద్రశేఖరన్
విడుదల తేది: 29.09.2005

హృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం… ఆడుతున్న వయసే…
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా… చూపుల్లోన బతికా…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా
తొలిసారీ… కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా
హృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం… ఆడుతుున్న వయసే…
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా… చూపుల్లోన బతికా…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా…

చరణం: 1
కుందనం మెరుపు కన్నా… బంధనం వయసుకున్నా…
చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా… కోరికే తెలుపుకున్నా…
చూపే వేసీ బతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా…
నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా…
నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా…
హృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం… ఆడుతుున్న వయసే…
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా… చూపుల్లోన బతికా…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా…

చరణం: 2
మనసులో నిన్ను కన్నా… మనసుతో
పోల్చుకున్నా… తలపుల పిలుపులు విన్నా…
సెగలలో కాలుతున్నా… చలికినే
వణుకుతున్నా… నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా… ఎండ చల్లనా…
తాపంలోనా మంచు చల్లనా…
కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా…
కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా…
హృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం… ఆడుతుున్న వయసే…
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా… చూపుల్లోన బతికా…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ…
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా…

********   *********   ********

చిత్రం: గజిని (2005)
సంగీతం: హారీస్-జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తిక్

ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే

చరణం: 1
పాత పదనిస దేనికద నస నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా… నీ… సా…
నను తాకె కొండమల్లికా… నీ… సా…
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే

చరణం: 2
పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే
పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా
హో… కనులారా చూడాలే తడి ఆరిపోవాలే
ల రలాల లర లల లాల… ఓ… ల రలాల లర లల లాల… ఓ…
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Oke Okkadu (1999)
error: Content is protected !!