Gharana Donga (1980)

Advertisements

చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి , మోహన్ బాబు
కథ, మాటలు:
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సురేష్ వర్మ
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 29.03.1980

పల్లవి:
వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా… నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా… చలిలో…
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ…  మనసు కలిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా… నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

చరణం: 1
చిలిపి చినుకుల చిత్తడిలో… వలపు మెరుపుల సందడిలో
చిలిపి చినుకుల చిత్తడిలో… వలపు మెరుపుల సందడిలో
ఉరిమి పిలిచే నీ ఒడి కోసం… ఉలికిపడి నే చూస్తుంటే
కురిసి వెలిసిన వానలలో… కలిసి బిగిసిన కౌగిలిలో
ఓ..కురిసి వెలిసిన వానలలో… కలిసి బిగిసిన కౌగిలిలో
నలిగిపోయిన ఆకాశం… పగలు వెన్నెల కాస్తుంటే
చూపూ చూపూ మాటాడాలా… మాటామాటా మానెయ్యాలా
వలపు వలపు వాటెయ్యాలా… చలిలో…
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా… నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 

చరణం: 2
చలికి సణిగిన పల్లవితో… ఉలికి పలికిన పెదవులలో
చలికి సణిగిన పల్లవితో… ఉలికి పలికిన పెదవులలో
ముద్దులడిగే ముచ్చట కోసం… పొద్దు గడవక చస్తుంటే
చీర తడిసిన ఆవిరిలో… ఆరిఆరని అల్లరిలో
ఓ..ఓ.. చీర తడిసిన ఆవిరిలో… ఆరిఆరని అల్లరిలో
హద్దు చెరిపే ఇద్దరి కోసం… మబ్బులెండను మూస్తుంటే

సిగ్గుల మొగ్గ తుంచెయ్యాలా… వెన్నెల పక్క పరిచెయ్యాలా
వేగుల చుక్క దాచెయ్యాలా… చలిలో…
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ…  మనసు కలిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా… నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా… చలిలో…
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

******  ******  *******

చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే… అందమంత ఇస్తుంటే…
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా… అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

Advertisements

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే… అందగాడు తోడుంటే…
చందమామ నిదరోయేదెట్టాగా… చందమామ నిదరోయేదెట్టాగా

చరణం: 1
కౌగిట్లో కాలాలు కరగాలని… తప్పెట్లు తాళాలు మోగాలని
వలపుల్ని దాచేసి ఒంటరిగుంటే… చెలి తోడు లేకుంటే ఎట్టాగా
ఎట్టాగా… ఎట్టాగా..

ఆ కౌగిళ్లే మన ఇల్లు కావాలని… మల్లె పొదరిళ్లే  పడకిళ్లు కావాలని
కలగంటే కాదంటే ఎట్టాగా… చలి తీరి పోతుంటే ఎట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..

గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. అబ్బా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

చరణం: 2
వానల్లే నువ్వొచ్చి తడపాలని… వరదల్లే నే పొంగిపోవాలని
చినుకుల్లో ఇల్లేసి ఒణుకుతు ఉంటే… చెలికాడు రాకుంటే ఎట్టాగా
ఎట్టాగా.. ఎట్టాగా

చుక్కల్లో పక్కేసుకోవాలని… రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని
అనుకుంటే తప్పైతే ఎట్టాగా.. ఈ ఆపలేని పులకింతలెట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..
గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా 

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే… అందమంత ఇస్తుంటే…
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా… అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే… అందగాడు తోడుంటే…
చందమామ నిదరోయేదెట్టాగా… చందమామ నిదరోయేదెట్టాగా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Donga (1985)
error: Content is protected !!