Gharshana (1988)

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: వాణి జయరాం
నటీనటులు: ప్రభు, కార్తిక్ , అమల, నిరోషా
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: సి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, పి.ఆర్.ప్రసాద్
విడుదల తేది: 15.04.1988

కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం: 1
ఆకులపై రాలు… ఆ… ఆ… ఆ…..
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
ఆకులపై రాలు హిమబిందువువోలె
నా చెలి ఒడిలోన పవళించినా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం…
నీవు నాకు వేద నాదం… ఆ… ఆ… ఆ…
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

చరణం: 2
కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు
వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేవిఁటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం… ఆ… ఆ… ఆ…
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవే శ్రీకారమే కావే
కురిసేను విరిజల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే

*******   *******   *******

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు , చిత్ర

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

చరణం: 1
పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లె పూల బంధమీవు ఓ’చెలి
అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
మెరిసే మల్లెల లోకం చిందే చల్లని గానం

చరణం: 2
తీయనైన ఆశలన్ని నీ వరం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే ఈ జీవితం
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోన నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

*******   *******   *******

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: చిత్ర

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

చరణం: 1
ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ
కలలే విందు చేసెనే
నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

చరణం: 2
ఈ వీణా మీటేది నీవేనంటా
నా తలపూ నా వలపూ నీదేనంటా
పరువాలా పరదాలూ తీసేపూటా
కలవాలీ కరగాలీ నీలోనంటా
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకూ నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈ వేళకు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

*******   *******   *******

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

చరణం: 1
ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి
లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి
ఆడి పాడేనులే అంతు చూసేనులే
చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింత లేదు ఇరుగు పొరుగు లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

చరణం: 2
రైక కోక రెండు లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండు లేవు అయినా మర్మం ఉంది
కళలూగించెలే కధలూరించెలే
కళ్ళు వల వేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలకలే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు……
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

*******   *******   *******

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: వాణి జయరాం

రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ
పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ
లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా
మైకం సాగనీ దాహం తీరనీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

చరణం: 1
మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయనే
నేడు పువ్వాయెనే ఓడుకల్లాడినే
సందేల వయసెందుకో చిందులేస్తున్నవీ
అందాల సొగసే నినూ అందుకోమన్నదీ
క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నదీ చిన్..నదీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

చరణం: 2
ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో
వేడి పరువాలలో పండగే చేసుకో
నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ
నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ
ఇవే ఇవే ఈ వేళా సుఖాల పూల వేడుకా వే..డుకా

రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే
ఊసులాడు నా కళ్ళూ నీకు నేడు సంకెళ్ళూ
పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళూ
లవ్ లవ్ ఈ కధా ఓ ఓ మన్మథా
మైకం సాగనీ దాహం తీరనీ
రోజాలే లేత వన్నెలే రాజాకే తేనే విందులే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
President Gari Pellam (1992)
error: Content is protected !!