Gharshana (2004)

చిత్రం: ఘర్షణ (2004)
సంగీతం: హారిస్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: టిప్పు, షాలిని సింగ్
నటీనటులు: వెంకటేష్ ,  ఆసిన్
దర్శకత్వం: గౌతమ్ మీనన్
నిర్మాతలు: జి.శ్రీనివాస రాజు, సి.వెంకట్రాజు
విడుదల తేది: 30.07.2004

చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా…
నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో  అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా…హా
వాహువహా వాహువహా ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా వాహువహా ఎవరినడగాలో ప్రేమేనా అని

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణా
బిడియములెరగని గడసరి సొగసుకు
తమకము లెగసెను నరాలలోన హా లోనా

ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ…
ఓ ఓ…ఓ ఓ… ఓ ఓ… ఓ

నన్నే నన్నే మార్చి నీ మాటల్తో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్

చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయారి జాణా ఆ జాణా
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీ వల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లాలల్లా లాలల్లాల లాల లాల లాలల్లాల

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
Tell me now tell me now, my dear
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో  అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా…హా
వాహువహా వాహువహా ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా వాహువహా ఎవరినడగాలో ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ… ప్రేమేనా… ఆనీ… ప్రేమేనా అనీ…

*********   **********    *********

చిత్రం: ఘర్షణ (2004)
సంగీతం: హారీస్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం:  ఫెబి మని ,  సునీత సారథి

ఓ…సే,  ఓ… నో  (2)

ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా
నా కోడె ఎదలో వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

డ్యూ… రా – సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా
డ్యూ… రా – వయ్యారం దాచిపెట్టకే దేహమా
డ్యూ… రా – ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా
డ్యూ… రా – పరువాలే పల్లవించే రాహమా

ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా

ఇంటిలో వాస్తు మొత్తం
కొత్తగా ఉంది  నేస్తం
మార్చేశా మరి నీ కోసం
ఎదురుగా ఉంది అందం
తపనలే తీర్చు మంత్రం
చేస్తావా ఒడిలో యాగం
సలసల మంది కన్యరక్తం
కలబడమంది కాలచక్రం
కలవమంటేను నీకు కలవరమా…

ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా
ఆపతరమా పూలశరమా

కో: పరువమా పరువమా పరువమా పరువమా హే…

మనసులో మదనరూపం
తనువులో విరగదాపం
నాలో రేపే ఏదో దాహం
సరసమే మనకు సర్వం
సుఖములో చిలిపి స్వర్గం
పరువాలే పరిచింది దేహం
తలపడమంది  పూల తల్పం
తొరపడమంది పాల శిల్పం
చిన్ని కలలోనే ఇంత పరవశమా

నా కోడె ఎదలో వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

డ్యూ… రా – సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా
డ్యూ… రా – వయ్యారం దాచిపెట్టకే దేహమా
డ్యూ… రా – ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా
డ్యూ… రా – పరువాలే పల్లవించే రాహమా

డ్యూ…రా – మోహమా (3)

*********   **********    *********

చిత్రం: ఘర్షణ (2004)
సంగీతం: హారీస్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం:  హరిణి

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

గాలే తాకనీ నాలో సోకునీ
ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
నా అందంచందం అంతా నీ కోసం
తోడే లేదనీ కాలే కౌగిలీ
ఎప్పటి నుంచీ ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతోదురం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

జారే పైటకీ తూలే మాటకీ
తాపం పెంచిందయ్యో నీరూపం
ఏనాడు లేనే లేదు ఈ మైకం
నాలోశ్వాసకీ రేగే ఆశకీ
దాహం పెంచిందయ్యో నీ స్నేహం
గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం

మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

*********   **********    *********

చిత్రం: ఘర్షణ (2004)
సంగీతం: హారీస్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: సూచిత్ర , కే. కే.

ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా

చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్నాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా…

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా, తడిసి పోతున్నా

శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగుతీస్తావు న్యాయమా ప్రియతమా…

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా
ఒమహ జియ్యా వాహి యాయా
వాహి యాయా జియ్యామేమసయ్యా

గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదపకాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నే డైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి  చేరవా నేస్తమా…

చెలియ చెలియ చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్నాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా…

*********   **********    *********

చిత్రం: ఘర్షణ (2004)
సంగీతం: హారీస్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రీనివాస్

కిసి ఆషిక్ కా ఖయల్ హై తేరి ఆఖి లెహరా భిచాల్  హై
ఎక్ ప్యారాస సవాల్ హై ఏ తో బస్ హి కా మాల్ హై హై హై హై

భీగీ భీగీ సీ ఏ  రాత్ హై
హే తో ప్యార్ కా ఏ రంగ్ హై
భీగీ భీగీ సీ ఏ  రాత్ హై
హే తో ప్యార్ కా ఏ రంగ్ హై

హే రంగ్ హై తరంగ్ హై (3)

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్ అచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
నువ్ అచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

హే రంగ్ హై తరంగ్ హై  (4)

భీగీ భీగీ సీ ఏ రాత్ హై  హే తో ప్యార్ కా ఏ రంగ్ హై (2)

ఈ పరిమళమూ  నీదేనా
నాలో పరవశమూ నిజమేనా
బొండుమల్లి పువ్వుకన్న తేలికగు నీ సోకూ
రెండు కళ్ళు ముసుకున్న లాగు మరి నీవైపూ
సొగసులు చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోను కొత్తవింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన ఉఁ హుఁ హుఁ

ఆ పలుకులలో పరవళ్ళూ
తూలే కులుకులలో కొడవళ్ళూ
నిన్ను చూసి ఒంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీకోసం
స్వరముల తీపి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనె పాడె సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్ అచ్చుల్లోన హల్లువో
నువ్ అచ్చుల్లోన హల్లువో
జడకుచ్చుల్లోన మల్లెవో
జడకుచ్చుల్లోన మల్లెవో
నువ్ అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Naa Peru Surya Naa Illu India
Naa Peru Surya (2018)
error: Content is protected !!