Gnani Sugnani Song Lyrics | జ్ఞాని సుజ్ఞాని పాట లిరిక్స్

Gnani Sugnani Song Lyrics

జ్ఞాని సుజ్ఞాని పాట… లిరిక్స్

సంగీతం: బాజి
సాహిత్య సేకరణ: గుడిమె స్వాతి
గానం: మంగ్లీ
దర్శకత్వం: దాము రెడ్డి
నిర్మాణం: శివ శంకర్ మాటూరి
విడుదల తేది: 19.09.2020

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుక
నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుక
ఇట్లా కుండలెంబడి తిరిగే… తెడ్డుకేమెరుకా..

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

వనము సింగారంబు… కోయిలకు ఎరుక
వనము సింగారంబు… కోయిలకు ఎరుక
ఇట్లా కంపాలెంబడి తిరిగే… కాకికేమెరుకా..

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

బాటాసింగారంబు… అశ్వానికెరుకా..
బాటాసింగారంబు… అశ్వానికెరుకా..
ఇట్లా గరికా తుట్టెలు తినే… గాడిదాకేమెరుక

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

నాగస్వరము మోత… నాగుపాముకేరుకా..
నాగస్వరము మోత… నాగుపాముకేరుకా..
ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్ట్యాకేమెరుకా..

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

మడుగు సింగారంబు… మత్స్యానీకెరుకా..
మడుగు సింగారంబు… మత్స్యానీకెరుకా..
ఇట్లా కడల కడలా తిరిగే… కప్పాకేమెరుకా..

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు…

సద్గురుడుండే మరుగు… ||2||
ఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****