చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, మాల్గాడి శుభ
నటీనటులు: పవన్ కళ్యాణ్, రాశి, హరీష్ కుమార్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బి. శ్రీనివాస రాజు
విడుదల తేది: 22.08.1997
తళుక్ తళుక్ మని తళుకుల తార
మిణుక్ మిణుక్ మని మిలమిల తార
ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ… (2)
హా… ఆ… లాల లాల లాలా లాలలా
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా
మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా…
తళుక్ తళుక్ మని తళుకుల తార
మిణుక్ మిణుక్ మని మిలమిల తార
ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ… (2)
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా…
చరణం: 1
అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా
అలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మనకోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మన దారికెదురున్నదా…
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
చరణం: 2
నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా
ఎండైనా వెన్నెల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా
కష్టాలు కన్నీళ్ళు మరిపించదా
జీవించడం నేర్పదా…
మనసున్న కనులుంటే ప్రతిచోట
మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా
మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా…
లాలాల లలలాల లలలాల లలలాల లాలాల (2)
******** ******* ********
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
వరించి నన్ను చేరుమా…
సుఖాన ముంచి తేల్చుమా…
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
చరణం: 1
రా రమ్మంది లేత చెక్కిలి
రేపెట్టింది కొత్త ఆకలి
సిగ్గు మొగ్గ మేలుకుంది తియ్యగ
తేనె ముద్దలారగించు హాయిగ
అంత భాగ్యమ పంచ ప్రాణమ
ఒడిలో చేరనీయుమా… హో
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
చరణం: 2
లాగించేస్తే ప్రేమ జిలేబి
ఏమౌతుందో కన్నే గులాబి
పాలపొంగులాంటిదమ్మ కోరిక
పైటచాటు దాచుకోకే ప్రేమికా
కొంగుజారితే కొంపమునగదా
వాటే రిస్కు మన్మథా
అందాల సీమలోని పారిజాత పుష్పమ
ప్రాణాలు పోసుకున్న పాలరాతి శిల్పమ
వరించి నన్ను చేరుమా…
సుఖాన ముంచి తేల్చుమా…
ప్రియాతి ప్రియతమ ఇదేమి సరిగమ
శృంగార వీణ మీటి గోల చేస్తే న్యాయమ
మ్మ్..మ్మ్..మ్మ్…
******** ******* ********
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల
ముద్దు బాలుడెవరే
వెన్న కొల్ల గొను కృష్ణ పాదముల
ఆనవాలు కనరే
ఆ… ఆ… ఆ…
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
పదుగురి నిందలతో పలుచన కాకయ్యా
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఏ నోట విన్నా నీ వార్తలేనా
కొంటె చేష్టలేలరా కోణంగిలా
ఆ.. ఊరంత చేరి ఏమేమి అన్నా
కల్లబొల్లి మాటలే నా రాధికా
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా
ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా
తెలియని లీలలతో తికమక చేయకయా
మనసుని చూడకనే మాటలు విసరకలా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా
అంతతోనే ఆగెనా ఆ బాలుడు
ఆ..అవతార మూర్తిగా తన మహిమ చాటెగా
లోకాల పాలుడు గోపాలుడు
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కథ తరములు నిలిచె కదా
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా
అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
అందెల సందడితో గుండెలు మురిసెనురా
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
******** ******* ********
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మురళీధర్ , స్వర్ణలత
హే హే హే హే హే హే
హే హే హే హే హే హే
పల్లవి:
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్లే పరమేశా
వేవేల ఆశలతో వస్తుంది పూబాల
మెళ్ళోన మురిపెంగా వేస్తుంది వరమాలా
హో….ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్లే పరమేశా
చరణం: 1
ఎల్లోర శిల్పమల్లే నువ్వు కూర్చుంటే
నిండుగా నేను చూస్తుంటే హే
ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే
ఎదే బరువెక్కిపోతుంటే
శుభమంత్రాలే వినబడుతుంటే
పచ్చని తాళి నువు కడుతుంటే
ఎన్నెన్నో జన్మల బంధం
నిన్నూ నన్నూ ఏకం చేస్తుంటే
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
ఓ నీ నీడ నేనై ఉంటా పరమేశా
చరణం: 2
క్రీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే
నువ్వేమో సిగ్గు పడుతుంటే
నాపైన వెచ్చగా నువ్ వాలిపోతుంటే
ఒళ్ళంతా కాగిపోతుంటే
మల్లెల మంచం వణికేస్తుంటే
వెన్నెల రేయి వరదౌతుంటే
తమకంతో జారే పైటా
రారమ్మంటూ కవ్వించేస్తుంటే
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
పరువాల దాహం తీర్చేయ్ పరమేశా
కవ్వించు అందాలు కళ్ళార చూడాలా
కౌగిళ్ళ జాతరలో తెల్లారి పొవాలా
హో… ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
******** ******* ********
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది
పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏదోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్లే తెరిచేలా
ఇలా… నిను లాలించేదా లే లెమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా
చరణం: 1
ఎన్నో రుచులు గల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలుసున్నది
రేయోక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా?
కలకాలము కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా
చరణం: 2
నీలో చూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో బోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలిణాలనే మసి చేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా
నిను తాకిందేమో ఈ వేధన
మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏదోల వింటుంది నీ మది
******** ******* ********
చిత్రం: గోకులంలో సీత (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
వలపుల వనమా – ఆ…ఆ…ఆ…
వెలుగుల వరమా – ఆ..ఆ..ఆ…
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
చరణం: 1
ఎంత మధనమో జరగకుండ
ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా
ఎన్ని ఉరుములో విసరకుండ
ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా
ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా
ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా
అణువణువూ సమిధలాయే
ఈ యాగం శాంతిచేదెపుడమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
చరణం: 2
ఆయువంత అనురాగ దేవతకి
హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు
మాయమైన మమకారమేదియని
గాలినడుగుతున్నాడు జాలిపడవ ఈనాడు
నిలువున రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
వలపుల వనమా – ఆ..ఆ..ఆ..
వెలుగుల వరమా – ఆ..ఆ..ఆ..
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా