Good Bad Ugly (2017)

చిత్రం: గుడ్ బ్యాడ్ అగ్లీ (2017)
సంగీతం: హర్షవర్ధన్
సాహిత్యం: శ్రీమణి
గానం: హర్షవర్ధన్
నటీనటులు: శ్రీముఖి , మురళి కృష్ణ,  కిషోర్
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాత: బగాడి అంజిరెడ్డి
విడుదల తేది: 2017

నిజమా  నమ్మ తరమా…
నిజమా  నమ్మ తరమా
కలలో దేవి వరమా
అరచేత భాగ్య రేఖ పూచినా
అరుదైన కోరికేదొ తీర్చినా
తలరాత మార్చి ఉసురు పెంచెనా
ఎదురుగ నిలచి

మనసులో మౌన కీర్తనం
కనులలో ప్రమద నర్తనం
అరవిరిసినది నిశిలో తొలి కార్తీకం
తెగమురిసినది శశిలా సఖి సంగీతం
వెతకబోవు తీగలా అల్లుకుంది చెలిలా
మనసులో మౌన కీర్తనం

తన కమలకుంటే బ్రమరమింక పూవు రాలినా
గగనాన తెగిన పటముకై ఈ ధరణి ఎగసినా
గుండె గాయమై గొంతే గేయమై
పోయే ప్రాణమే ఆగిచూసెన కాలే కాలమే లాలి పాటల
వాలే పొద్దులు పొద్దు పూసినా
అంతవరకు ఆగిపోయినా
కావ్యమాలి సాగిపోయినా…
పరిధిలేని ప్రేమలో మునిగి తేలనా..

error: Content is protected !!