చిత్రం: గూండా రాజ్యం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: సి. వెంకట్రాజు , జి.శివరాజు
విడుదల తేది: 02.03.1989
చక్కని గాజుల్ని సారంగా
తొడిగించు తొడిగించు మెల్లంగా
చక్కని గాజుల్ని సారంగా
తొడిగించు తొడిగించు మెల్లంగా
ఊగే ఈ నొప్పితో మరితీరదు
బురంటీ బుగ్గని ముద్దాడితే
లేత లేత వయ్యారాలే
మోత మోగి పోవాలంటా
అచ్చోచ్చే గాజుల్ని అందంగా
తొడిగేస్తా తొడిగేస్తా మెల్లంగా
అచ్చోచ్చే గాజుల్ని అందంగా
తొడిగేస్తా తొడిగేస్తా మెల్లంగా
గమ్మత్తుగుంటది నీ చేతికి
నొప్పేది పుట్టదు నాజూకుకి
చూశారంటే ఆడోళ్ళంతా
దాసోహాలే చెయ్యాలంటా
చక్కని గాజుల్ని సారంగా
తొడిగేస్తా తొడిగేస్తా మెల్లంగా
చరణం: 1
తొడిగేస్తే నా చేతికి అదరాలి నా వంటికి
నునుపైన నీ నుదుటికీ దిద్దేస్తా కస్తూరిని
జారింది పడుచు పైట నీ చూపుకి
ఎగిరింది పిల్లమనసు నీవేపుకి
జాగర్త జారి జారి పడిపోతాదే
జాతర్లో కొచ్చినాక గోడవౌతాదే
నచ్చిన దానికి కానుక ఇంతేనా
రవ్వల గాజుల రాణికి తందాన
ఈ ముద్దుల మోత గాజుల కూత
వయ్యారాలే ఇస్తాదంట
అచ్చోచ్చే గాజుల్ని అందంగా
తొడిగించు తొడిగించు మెల్లంగా
చరణం: 2
అందాల చలి మద్దెల వందేళ్లు మోగించని
సరదాల పందేలలో సందళ్లే సాగించరా
సయ్యంటే చాలు నువ్వు సందేళ్ళకి
తాళాలు తప్పవింక తాపాలకి
ఊరిస్తూ రేపుగోకు ఉబలాటమే
కూసింత లేదు నాకు మోమాటమే
చీటికి మాటికి చాటుకు రావాలి
చీకటి దాటని సిగ్గులు తగ్గాలి
ఇక తప్పదు లేవే పక్కకు రావే
ఇక హద్దు పద్దు లేనే లేవే
చక్కని గాజుల్ని సారంగా
తొడిగించు తొడిగించు మెల్లంగా
గమ్మత్తుగుంటది నీ చేతికి
నొప్పేది పుట్టదు నాజూకుకి
లేత లేత వయ్యారాలే
మోత మోగి పోవాలంటా
అచ్చోచ్చే గాజుల్ని అందంగా
తొడిగించు తొడిగించు మెల్లంగా