Gorintaku (2008)

Gorintaku Lyrics

అన్నా చెల్లెలి అనుబంధం… లిరిక్స్

చిత్రం: గోరింటాకు (2008)
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాణం: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 04.07.2008

ఆ….ఆఆ ఆ…..ఆ….ఆఆ ఆ…..

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ.. అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా… ఆ..ఆ…. మా ఇంట పండగా…

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ.. అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా… ఆ..ఆ…. మా ఇంట పండగా…

విరిసినది వెన్నెలే ఇలా, అచ్చు నా చెల్లి నవ్వులా..
స్వర్గమే నేరుగా, మా ఇంట వాలగా..
కురిసినది ప్రేమ చినుకులా..
అదే, మా అన్న చూపులా..
కన్నులే తడిసెనే, నవ్వుల హాయిగా..
నీ కంటి రెప్పను నేనై, తోడుగ ఉన్నాలే..
నీ గుండెకు ఊపిరి నేనై, ఎప్పుడూ ఉంటాలే..
అందుకే, నువ్వు లేక నే లేనులే..
ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యె వరమివ్వు నాకు చాలంటా..
దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ!

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారకల కోలాహలం

ఛం ఛం ఛం ఛం… ఛమ ఛమ ఛమ ఛమ…
ఛం ఛం ఛం ఛం… ఛమ ఛమ ఛమ ఛమ…

బుడి బుడి నడకలు ఎన్నో, నేర్పిన కన్నతండ్రిలా..
పాదమే కందని, ఓ పూల దారిలా..
చిరు చిరు గోరుముద్దలే, తినిపించు కన్నతల్లిలా..
తులసివై వెలసిన, ఈ ఇంటి దేవతా..
అన్నా అన్న మాటే కాదా, నాకిక ఓంకారం
చెల్లీ నువ్వు పుట్టిన రోజే, ప్రేమకు శ్రీకారం
మా ఇల్లు అనురాగ గుడి గోపురం
సిరులెన్ని ఉన్న సరితూగలేవు, నా చెల్లి చిన్ని నవ్వులకూ..
నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవ!

అన్నా చెల్లెలి అనుబంధం
జన్మజన్మల సంబంధం
జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారకల కోలాహలం
అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ.. అరచేతిలోనా హరివిల్లై
గోరింట పండగా… ఆ..ఆ…. మా ఇంట పండగా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****