చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , జమున
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 1974
(ఈ పాట పోకిరి సినిమాలో రీమిక్స్ చేశారు)
గల గల పారుతున్న గోదారిల
రెప రెప లాడుతున్న తెరచాపల
ఈ చల్లని గాలిల ఆ పచ్చని పైరుల
ఈ జీవితం సాగని హాయిగా
అందాల పందిరి వేసే ఈ తోటలు
ఆ నింగి అంచులు చేరె ఆ బాటలు
నాగలి పట్టె రైతులు కడవలు మొసే కన్నేలు
బంగరు పంటల సీమలు
దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యము
సత్యం ధర్మం నిలిపితే న్యాయం కొసం కోరుటే
పేదల సేవలే చేయుటే జీవితం