చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత , సందీప్
నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య, శర్వానంద్
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.09.2004
పల్లవి:
నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువగా
నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
చరణం: 1
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
నీ నేస్తమే కవి క్షేత్రమై
ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి
లేత పూతపడ్డ కులుకుతున్నది
మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి
నాకు పచ్చనాశ చూపుతున్నది
ప్రాయమే తోడుగా నడపగా
నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
చరణం: 2
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన
అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా
మన్నించుమా మమకారమా
తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని
అందుకుంది చూడు నిండు దోసిలి
నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి
గొంతు దాటనంది ఎందుకో మరి
మౌనమే గానమై తెలుపదా