Gowthami (1987)

చిత్రం: గౌతమి (1987)
సంగీతం: ఎస్.పి.బాలు
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: ఎస్.పి.బాలు, సుశీల
నటీనటులు: సుహాసిని, శరత్ బాబు, రవిబాబు
మాటలు: గణేష్ పాత్రో
దర్శకత్వం: క్రాంతి కుమార్
అసోసియేట్ డైరెక్టర్: గుణశేఖర్
నిర్మాత: మండవ గోపాల కృష్ణ
విడుదల తేది: 1987

పల్లవి:
చీకటి కాటుక చారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో…
చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో…

వెలిగింది నా ప్రాణదీపం …ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం …మది నీకు నీరాజనం
ప్రతి అణువు… పూలహరం..ఉం…
వెలిగింది నా ప్రాణదీపం… ఈ జన్మంత నీ పూజకోసం

చరణం: 1
నలుపైన మేఘాలలోనే …ఇల నిలిపేటి జలధారలేదా
నలుపైన మేఘాలలోనే… ఇల నిలిపేటి జలధారలేదా
వసివాడు అందాలకన్నా …నీ సుగుణాల సిరి నాకు మిన్నా
వసివాడు అందాలకన్నా …నీ సుగుణాల సిరి నాకు మిన్నా

తీయని ఊహలతీరము …చేరువ చేసిన స్నేహము… ఏనాటి సౌభాగ్యమో

వెలిగింది నా ప్రాణదీపం… ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం …మది నీకు నీరాజనం
ప్రతి అణువు… పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం… ఈ జన్మంత నీ పూజకోసం

చరణం: 2
నూరేళ్ళ బ్రతుకీయమంటు …ఆ దైవాన్ని నే కోరుకుంటా
నూరేళ్ళ బ్రతుకీయమంటు …ఆ దైవాన్ని నే కోరుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి …నీ పాదాల అర్పించుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి …నీ పాదాల అర్పించుకుంటా

మాయని మమతల తావున… నిండిన జీవనవాహిని… ప్రతిరోజు మధుమాసమే..

వెలిగింది నా ప్రాణదీపం …ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం… మది నీకు నీరాజనం
ప్రతి అణువు …పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం… ఈ జన్మంత నీ పూజకోసం

error: Content is protected !!