చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , శుభ
దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్
నిర్మాతలు: పి.బాబ్జి, జి.సాంబశివరావు
విడుదల తేది: 26.05.1972
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో
వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ…
ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ…
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే
ఎన్ని పున్నమలు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ…
ఏనాటి బంధమీ అనురాగం