చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ – విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు
విడుదల తేది: 05.01.1962
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై
కలల అలలపై…..
చరణం: 1
జలకమాడు జవరాలిని
చిలిపిగ చూసేవెందుకు (2)
తడిసీ తడియని కొంగున
ఒడలు దాచుకున్నందుకు (2)
చూపుతోనె హృదయవీణ
ఝుమ్మనిపించేవెందుకు (2)
విరిసీవిరియని పరువము
మరులు గొలుపుతున్నందుకు (2)
చరణం: 2
సడి సవ్వడి వినిపించని
నడిరాతిరి ఏమన్నది (2)
జవరాలిని చెలికానిని
జంటగూడి రమ్మన్నది (2)
విరజాజులు పరమళించు
విరుల పానుపేమన్నది (2)
అగుపించని ఆనందము
బిగికౌగిట కలదన్నది (2)
********* ********* *********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ – విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల
మదన సుందర నాదొరా
ఓ మదన సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె
ఓ మదన సుందర నాదొరా
చరణం: 1
చిన్నదానను నేను – వన్నెకాడవు నీవు (2)
నాకూ నీకు జోడు (2)
రాకాచంద్రుల తోడు
చరణం: 2
మిసిమి వన్నెలలోన – పసిడి తిన్నెలపైన (2)
రసకేళి తేలి (2)
పరవశమౌదమీవేళ
చరణం:3
గిలిగింతలిడ యింత పులకింతలేదేమి (2)
ఉడికించకింక (2)
చూడొకమారు నా వంక
చరణం:4
మరులు సైపగలేను – విరహమోపగలేను (2)
మగరాయడా రార (2)
బిగికౌగిలి చేర
********* ********* *********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ – విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల
ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ
చరణం: 1
నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని
నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని
ఎవరికీ గాక ఏ దరిగానక
ఎవరికీ గాక ఏ దరిగానక
చివికి చివికి నే మ్రోడైపోతిని
చరణం: 2
నన్నె దైవమని నమ్ముకున్న – నా ఇల్లాలిని ఎడబాసితిని “2”
బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ “2”
బండలలో నొక బండనైతిని “ఒంటరి”
చరణం: 3
వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి
వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేస
గుండె ఆవిరైపోవుచుండ
ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని “ఒంటరి”
********* ********* *********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ – విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
చరణం: 1
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
చరణం: 2
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం…
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
********* ********* *********
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్ – విజయకృష్ణ మూర్తి
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, జానకి
పల్లవి:
కలల అలలపై తేలెను… మనసు మల్లెపూవై…
ఎగసి పోదునో చెలియా… నీవే ఇక నేనై…
కలల అలల పై..
చరణం: 1
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున… ఒడలు దాచుకున్నందుకు..
తడిసి తడియని కొంగున… ఒడలు దాచుకున్నందుకు..
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము… మరులు గొలుపుతున్నందుకు..
విరిసీ విరియని పరువము… మరులు గొలుపుతున్నందుకు..
కలల అలల పై..
చరణం: 2
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని… జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని… జంట గూడి రమ్మన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము… బిగికౌగిట కలదన్నది..
అగుపించని ఆనందము… బిగికౌగిట కలదన్నది..
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై…
ఎగసి పోదునో చెలియా… నీవే ఇక నేనై…
కలల అలల పై..