చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.ఆర్ , ఏ.యన్.ఆర్ , సావిత్రి , జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
నిర్మాతలు: బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 07.06.1962
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా…
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
అది యిది యేమని అన్ని రంగముల…
అది యిది యేమని అన్ని రంగముల
మగధీరులనెదిరించారు
నిరుద్యోగులను పెంచారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీ చేసి
చట్టసభలలో సీట్ల కోసం
భర్తల తోనే పోటీ చేసి
డిల్లి సభలో పీఠం వేసి…
డిల్లి సభలో పీఠం వేసి
లెక్చర్ లెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారు
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం
లేచింది, నిద్ర లేచింది
నిద్ర లేచింది మహిళాలోకం
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, పి.సుశీల
ఎంత హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి
ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోలపాడగా
మధురభావలాహిరిలో మనము తూలిపోవగా
మధురభావలహరలో మనము తేలిపోవగా
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
ఎంత హాయి – ఈరేయి
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: పి.రామకృష్ణ , పి.సుశీల
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునె ఊటీ శాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: పి.సుశీల
సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే
సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఏమో సిగ్గాయే
కనులు తెరచిన నీవాయే
నే కనులు మూసిన నీవాయే
కనులు తెరచిన నీవాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
కలవరపడి నే కనులు తెరువ
నా కంటి పాపలో నీవాయే
ఎచట చూసినా నీవాయే
కనులు తెరచిన నీవాయే
నే కనులు మూసిన నీవాయే
కనులు తెరచిన నీవాయే
మేలుకొనిన నా మదిలో యేవొ
మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో యేవొ
మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయ వెతక
నా హృదయ ఫలకమున నీవాయే
కనులు తెరచినా నీవాయే
కనులు మూసినా నీవేనాయే
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపగ తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటినే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని వోలలాడి మైమరచితిలే
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
ముసి ముసి నవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
ముసి ముసి నవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
రుస రుసలాడుతు విసిరిన వాల్జెడ
వలపు పాశమని బెదరితిలే
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపగ తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటినే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనము గానే మనసు పాడిన వేణుగానమును వింటిలే
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, పి.సుశీల
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలుమేలొయన్న మేలో నా రంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
మేలుమేలొయన్న మేలో నా రంగ
కొమ్మలకు వచ్చింది ఈడు
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాలా
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాలా
బేల బేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకలా కులికేను చాలా
బేల బేలోయన్న
దిద్ధినక ధిన దిద్ధినక ధిన దిద్ధినక ధిన ధిం
హేయ్ బేలబేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకలా కులికేను చాలా
ఈ బేల పలికితె ముత్యాలు రాల
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమొ మంచీదె పాపం
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమొ మంచీదె పాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంట చూసిన పొవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంట చూసిన పొవు తాపం
జంటుంటె ఎందురానీదు యే లోపం
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, పి.లీలా
వేషము మార్చెను… హోయ్!
భాషను మార్చెను… హోయ్!
మోసము నేర్చెను….అసలు తానే మారెను…
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు!
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు!
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను, వాదము చేసెను
వేదికలెక్కెను, వాదము చేసెను
త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు!
వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను,
తలలే మార్చెను…
అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు!
ఆ…ఆహహాహాహ ఆహాహహా…
ఓ… ఓహొహోహోహో ఓహోహొహో…
చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: పి.సుశీల
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే
రుసరుసలాడే చూపుల లోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ…
తల్లి మేలుకొని దొంగను జూచి
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
మోహనమురళీగానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
మోహనమురళీగానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి