చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అనూప్ రూబెన్స్, శ్రావణి
నటీనటులు: నితిన్, నిత్యా మీనన్, ఇషా తాళ్వార్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాతలు: నిఖితా రెడ్డి , విక్రమ్ గౌడ్
విడుదల తేది: 19.04.2013
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె…
అరె హో హో
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అందీ మైకం
తేనెకళ్ళ హోయలన్నీ ఓర చూపే చూసెనులే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీవల్లేనా
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
అరె ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలే
నీ నఖసిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
నిన్ను కోరి వచ్చినానయా ఓ రామయా
చిట్టి గుండెనే నువ్వే చురాలియా
ముందు వెనక చూడని పియా మై దిల్ దియా
మనసు చుస్తే ఆడుతోందియా
వీడిపోనే నిన్ను విడిచిపోనే
అందకుండా ఉండిపోనే
అడుగు దూరం నువ్వున్నావా
మాట వుంటే మైకమొచ్చెలే
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం
చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
ఓ నిను చుస్తే చాల్లే గాజుపూల వర్షాలే
ఓ నువ్వు వస్తే చాల్లే జాజిపూల జంపాలే
కోతలింక వద్దులేవయా సునో ప్రియా
ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్నా నీ చెలియా
ఏరికోరి నీకు దిల్ దియా
హే నిన్ను కోరి దూరం అంతా
చేరువాయే చెలువంతా
మనసులోని అణువణువంతా
నిండిపోతే తప్పు ఏంటటా
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె
******** ******** *********
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అద్నాన్ సామీ
నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం
కనుమూసిన కళ్లలోన చెరగని అనుభవం
ఒక ముల్లల్లే నన్నే గిల్లావే మల్లెపువ్వల్లే నన్నే తడిమావే
మెల్లగా మార్చేశావే ఈ ఆనందం అర్థం నువ్వే…
నీవే నీవే… నీవే, నీవే నీవే… నీవే (2)
నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం హో
హో… ఎదలో ఇంకోవైపు చూశావో చూపు
ఒకసారి రా నా వైపు
హో… కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు
పడిపోయా నేనే దాదాపు
కదిలేట్టుగా లేదు ఈ కాలమే కాసేపైనా నాతో రావే
క్షణం నీకు నే నచ్చినా…
నీవే నీవే… నీవే, నీవే నీవే… నీవే (2)
హో… చూసి చూడంగానే నే తేలిపోయా
ఏం మాయ నీలో ఉందే
హో… నవ్వే కొద్దీ నచ్చీ నువ్వంటే పిచ్చీ
పట్టింది ప్రేమే అంటానే
ఒడిలో నువ్వే నాలో ఒదిగుండవే
నీడైనా నీకు నేనేలే
నువు నా సొంతమవ్వాలిలే…
నీవే నీవే… నీవే, నీవే నీవే… నీవే (2)
********* ********* ********
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భువనచంద్ర
గానం: రామ్కి
ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
చరణం: 1
వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే నీ సొంతం అయితే
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా
చరణం: 2
జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్‌లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా
ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
******** ********* **********
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నిఖిల్ డి సౌజా, నిత్యా మీనన్
ఓ తూహి రే తూహి రే తూహి రే
ఓ నా హసీనా నీ వెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక ఐనా అందాకా రానా
కురిసే కవ్వింతల్లోన తడిసిందే నేనా
వెలిగేనా ఈ చెంత నీకోసమేన
తూహి హై మేరీ జానా ఓ…
తూహి హై మేరీ జానా ఓ…
తూహి హై మేరీ జానా
ఓ జానే జా… జానే జా…
ఓ జానే జా… జానే జా…
తూహి హై మేరీ జానా ఓ…
తూహి హై మేరీ జానా ఓ…
ఓ నీతో చెలిమే పెరిగి అది చనువుగ మారిందో
కథలో తెలియని మలుపే ఉందో ఏమో
నన్నే పిలిచావు నువ్వే కలిశావు మాయ చేశావులే
ఇదో రకం లోకం కాదా ముఖాముఖి తెలియక
తూహి హై మేరీ జానా ఓ
తూహి హై మేరీ జానా
ఓ నా హసీనా నీ వెంటే రానా
నే నీవై పోనా ప్రతి అణువు లోన
ఎందాక అయినా అందాకా రానా
ఓ తూహి రే తూహి రే తూహి రే
హా ఏదో రోజు ఎదురై కలవాలని మైకంలా
అదుపే తప్పిన మనసేమందో నీతో
వదిలేస్తే ఇంకా చీర నీ చెంత కొత్త తుళ్ళింతనే
రాసుందిలే నాతో ఇలా నువ్వేలే నా వెన్నెలా
హో హొ
తూహి హై మేరీ జానా ఓ
తూహి హై మేరీ జానా ఓ
ఓ తూహి రే తూహి రే తూహి రే
******** ********* **********
చిత్రం: గుండెజారి గల్లంతయ్యిందే (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నితిన్, చైత్ర , రంజిత్, తాగుబోతు రమేశ్, దనుంజయ్
హాల్లో ఎవ్రీబడి
ఏయ్ ఎవ్వరు లేరిక్కడ నేనొక్కడినే ఉన్నా
వెల్కమ్ టు ద పార్టీ
అబ్బా… వస్తున్నా వస్తున్నా
లేడీస్ అండ్ జెంటిల్ మేన్
హే… కమాన్ టు ద డాన్స్ ఫ్లోర్
కం ఆన్, కం ఆన్, కం ఆన్ ఆహా ఆహా
హో లేడీస్ అండ్ జెంటిల్ మేన్
నేనే సింగల్ అగైన్
బ్యాక్ టు మింగిల్ అగైన్ అండ్ అగైన్
లేదింకా ఏ టెన్షన్ చేసేశా కన్ఫ్యూషన్
నా హార్ట్ లో ఎంట్రీకుంది పర్మిషన్
జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఆనందం ఎంతైనా ఇంకా కావాలన్నా
ఈ నైట్ కి నైటవుట్ చేసేయ్ రా…
చేసేద్దాం…
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్
జ్వాలా, హే జ్వాలా
హీర్ కమ్ ద లేడీ జ్వాలా
షీస్ గొన్నా గొన్నా మేక్ యు హౌలా
హుఁ దోస్తీనైతే పంచుకో మస్తీనైతే పెంచుకో
సోలో గా ఉంటే చిరాకో
మనసే అటీను వయసే దాటెను టీను
దిల్ ఖోల్ కే తు జీలో…
ఐ లవ్ మై సెల్ఫ్ వెరీ వెరీ
నో హార్ట్ ఫీలింగ్స్ నహి నహి
సెట్ మి నౌ ఆన్ ఫైర్
అండ్ టేక్ మి హై, హయ్యర్
జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఈ నైట్ కి నైటవుట్ చేసేయ్ రా…
స్టాప్ స్టాప్ హోల్డ్ ఆన్
నైటవుట్ ఎందుకమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయా
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్
హో లేడీస్ అండ్ జెంటిల్ మేన్
నేనే సింగల్ అగైన్
బ్యాక్ టు మింగిల్ అగైన్ అండ్ అగైన్
హే కమాన్ కమాన్ కమాన్…
ఓ అన్నా ఓ అన్నా ఇక్కడ రా ఇక్కడ రా
లచ్చమ్మంటే గీమెనే కదా ?
శభాష్ బేటా మస్త్ గుర్తు పట్టినవ్ పో
అరె కోడిబాయె లచ్చమ్మది
కోడిపుంజుపాయె లచ్చమ్మది
తోటబాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది
హే ఆటల్లోనే బెస్ట్ రో అన్నింట్లోనే ఫస్ట్ రో
నాకోసం క్యూ కట్టేస్తారో…
ఈ ఊరు ఊరు మోగింది నా పేరు
నా స్టయిలే కొంచం వేరు
సో వాట్ యు సే పోరి
యు డిడ్ మై దిల్ చోరీ
ఐ స్టిల్ లైక్ యు సారీ
జస్ట్ సే మీ అవుట్ సారీ
జో హువా సో హువా
అబ్ తో మైఁ ఫ్రీ హువా
ఈ నైట్ కి నైటవుట్ చేసేయ్ రా…
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
నైటవుటే డింగ్ డాంగ్
డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్
ఔటైతే డింగ్ డింగ్ డాంగ్
కమాన్ కమాన్ కమాన్…
కమాన్ , అబ్బా కం ఆన్
హట్ ఇంటికి పోవలె సప్పుడు చేయకుండు