చిత్రం: గుండెల్లో గోదావరి (2013)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆర్. రాము
గానం: గీతామధురి
నటీనటులు: ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సి పన్ను, మంచు లక్ష్మి
దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
నిర్మాత: మంచు లక్ష్మి
విడుదల తేది: 08.03.2013
పల్లవి:
వెచ్చాని… వెచ్చాని
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
హేయ్ వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
పులసల్లే వయసు ఎదురీదుతుంది
వలవేసి పట్టేసుకో నను వరదల్లే ముంచేసిపో
వెన్నెట్లోనా పున్నాగల్లే వన్నె చిన్నె పూసాయిలే
నా వన్నె చిన్నె పూసాయిలే
తేనల్లే తాగేసిపో నీ మధువుల్ని కాజేసిపో
తొలిజాము దాకా నెలరాజు నువ్వే
వాటంగా అల్లేసుకో నా చూపంతా గిల్లేసుకో
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
చరణం: 1
పచ్చి వెన్నాతో పెంచాను సోకు
మచ్చ పడకుండా దాచాను నీకు
పచ్చి వెన్నాతో పెంచాను సోకు
మచ్చ పడకుండా దాచాను నీకు
అత్తారు గంధం పన్నీరు పూసి
మొత్తంగా ఉన్నా నాజూకు ఒళ్ళు
నాజూకు ఒళ్ళు నాజూకు ఒళ్ళు
కస్తూరి కలబోసిన నన్నే పస్తుంచి పోమాకురా
వేడెక్కి ఉన్నా తోడింక నువ్వే
నీ మంట చల్లార్చిపో నన్ను చలిమంట కాచేసుకో
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
చరణం: 2
చెంగావి చీర చేస్తాను చెల్లు
రతనాల రైక రాసిస్తా విల్లు
హేయ్ చెంగావి చీర చేస్తాను చెల్లు
రతనాల రైక రాసిస్తా విల్లు
పదహారు పరువం నీ పరుపు చుట్టూ
పట్టేసుకోరా కౌగిళ్ళలోన
కౌగిళ్ళలోన కౌగిళ్ళలోన
కలబడిపో జల నాగులా
నాలో జొరబడిపో పిడిబాకులా
తనగోడు కొంచం వినమంది మంచం
మనసారా వాటేసుకో నన్ను కసితీరా కాటేసిపో
మనసారా వాటేసుకో నన్ను కసితీరా కాటేసిపో