చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: బాలమురళికృష్ణ
నటీనటులు: శరత్ బాబు, సరిత, సుజాత
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాతలు: పి. ఆర్. గోవింద రాజన్ , జె. దొరస్వామి
విడుదల తేది: 07.09.1979
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
కోర్కెల సెగ నీవు
ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యల్లవే మనసా
మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పగిలేవు “
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
****** ******* ******
చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: ఎం ఎస్ విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: మంగళంపల్లి బాల మురళి కృష్ణ
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా