చిత్రం: గువ్వలజంట (1981)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ
దర్శకత్వం: కె.వాసు
నిర్మాత: జి.సత్యన్నారాయణ రాజు
విడుదల తేది: 06.11.1981
(రంగనాథ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం విలన్ పాత్ర పోషించారు)
పులకరింత పూసిందమ్మ
కలవరింత కాసిందమ్మో
కొత్త కొత్తగా కోయిలమ్మ
గుండెకాయలో కూసిందంమో
కుహు కుహు కుహు
ఏటి గాలిలో ఏణువున్నది
పైటలాగినా పాటగున్నాది
మల్లియల్లో ఎన్నియల్లో
మల్లియల్లో పండుగల్లో
యవపూవులా తుమ్మెదలాడే
తీపి తేనెలా తానాలాడే
కొమ్మలో కోయిలమ్మలో
పూల రెమ్మలో ఎన్ని వయ్యారాలో
దొండపండులా పెదవులున్నాయి
కొండమల్లెలా నగవులున్నాయి
గుండియల్లో అందియల్లో
నిండుతున్న సందడుల్లో
రెపటేళలా రెప్పలల్లాడే
ఎండకన్నులే నన్ను గిల్లాడే
నవ్వులో పాల గువ్వలో
రివ్వు రివ్వనే సిగ్గు సింగారాలో