Hanuman Junction (2001)

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్
నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయ
దర్శకత్వం: యమ్.రాజా
నిర్మాత: యమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 21.12.2001

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక

సితారందుకొని శృతే పెంచుకొని
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక
శోకాలు గుండెలోన రాగాలు గొంతులోన
చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు మోముపైన
పాడింది లేడికూన తనపాట అల్లరైన
ఆడింది సంబరాన తనబాట ముళ్ళదైన

సితారందుకొని శృతే పెంచుకొని
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

కిల కిల కోకిల కాకుల నడుమున కూతలు మార్చదుగా
గల గల వాగులు రాళ్లను తాకిన పరుగులు ఆపవుగా
సుడిగాలి చుట్టూ ముడుతున్నా
మరుమల్లెలు వాసన మారేనా
మెచ్చేవాళ్ళు గుచ్చేవాళ్ళు అంతా చూస్తున్నా
ఉత్సహంగా వచ్చిందేదో ఆలాపిస్తున్నా

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక

సితారందుకొని శృతే పెంచుకొని
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

తళ తళ తారక రాత్రికి భయపడి మెరవక మానదుగా
తళుకుల తామర బురదకు భయపడి విరియక మానదుగా
నిలువెల్లా జల్లే పడుతున్నా నెమలీకలు రంగే మారేనా
పంజాలేవో పైపైకొచ్చి అల్లరిచేస్తున్నా
సంతోషంగా సంగీతాన్నే అందించేస్తున్నా

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక
శోకాలు గుండెలోన రాగాలు గొంతులోన
చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు మోముపైన
పాడింది లేడికూన తనపాట అల్లరైన
ఆడింది సంబరాన తనబాట ముళ్ళదైన

సితారందుకొని శృతే పెంచుకొని
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

error: Content is protected !!