Happy Days (2007)

చిత్రం: హ్యాపీ డేస్ (2007)
సంగీతం: మిక్కీ జె.మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్
నటీనటులు: కమిలినీ ముఖర్జీ, తమన్నా, వరుణ్ సందేశ్, నిఖిల్, వంశీ కృష్ణ, సోనియా, గాయత్రి రావు, మోనాలి, రాహుల్
దర్శకత్వం & నిర్మాత: శేఖర్ కమ్ముల
విడుదల తేది: 02.10.2007

పాదమెటు పోతున్నా… పయనమెందాకైనా…
అడుగు తడబడుతున్నా… తోడురానా…
చిన్ని ఎడబాటైనా… కంటతడి పెడుతున్నా…
గుండె ప్రతి లయలోనా… నేనులేనా…

ఒంటైరె నా ఓటమైనా…
వెంటనడిచే నీడవేనా…
ఓ… మై ఫ్రెండ్…
తడి కన్నులనే తుడిచిన నేస్తమా…
ఓ… మై ఫ్రెండ్…
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా…

చరణం: 1
అమ్మ ఒడిలో లేని పాశం
నేస్తమల్లే… అల్లుకుందీ…
జన్మకంతా తీరిపోనీ
మమతలెన్నో… పంచుతోందీ…
మీరు మీరు నుంచీ… మన స్నేహగీతం…
ఏరా ఏరాల్లోకీ మారే…
మోమాటాలే లేనీ… కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా…
వెంటనడిచే నీడవేగా…
ఓ… మై ఫ్రెండ్…
తడి కన్నులనే తుడిచిన నేస్తమా…
ఓ… మై ఫ్రెండ్…
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా…

చరణం: 2
వాన వస్తే కాగితాలే
పడవలయ్యే జ్ఞాపకాలే…
నిన్నుచూస్తే చిన్ననాటీ
చేతలన్నీ చెంతవాలే…
గిల్లి కజ్జాలెన్నో… ఇలా పెంచుకొంటూ…
తుళ్ళింతల్లో తేలే స్నేహం…
మొదలో తుదలో తెలిపే…
ముడి వీడకుందే…
మోమాటాలే లేనీ…
కలే జాలువారే !

ఒంటైరె నా ఓటమైనా…
వెంటనడిచే నీడవేగా…
ఓ… మై ఫ్రెండ్…
తడి కన్నులనే తుడిచిన నేస్తమా…
ఓ… మై ఫ్రెండ్…
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా…

********  *********  *******

చిత్రం: హ్యాపీ డేస్ (2007)
సంగీతం: మిక్కీ జె.మేయర్
సాహిత్యం: వెంకటేష్ పట్వారి
గానం: కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య సిద్దార్థ్, శశి కిరణ్

పొద్దు లెగాలీ…స్నానం చెయ్యాలి…
బస్సు ఎక్కాలి…కాలేజ్ కెల్లాలి
బాత్‌రూంలో పాటలు బ్రేక్‌ఫాస్ట్‌తో మాటలు
అమ్మ ముందు వండర్లు…నాన్న ముందు బ్లండర్లు…
పాకెట్ మనీకి టెండర్లు
ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్
ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్ బోర్డు ఫయిటింగు కాంటీన్ లో మీటింగ్
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ

టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు
ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు..
టీచర్స్‌తో క్లాస్సులు క్లాస్‌లో మాస్‌లు
ఎస్.ఎం.ఎస్.లో మాటలు ఎం.ఎం.ఎస్.తో ఆటలు…
లాస్ట్ బెంచ్ సీటింగు సెల్‌ఫోన్ గేమింగు

ఇంటర్‌వెల్ కై వెయిటింగ్
లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగ్‌జైన్స్ రీడింగు
ఇంటర్‌వెల్ కై వెయిటింగ్
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
పొద్దున లెగాలీ…స్నానం చెయ్యాలి…

ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ మాటినీలు
హర్రీలో బౌలింగు ఫుడ్ కోర్ట్ లో డేటింగు
హే పిల్ల వాట్ మేన్ నీ స్టైలంటే ఇల్ల నీ కన్ఫర్మేషన్ నిల్ల
హే పిల్ల హే పిల్ల
పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల … హే హే
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ జిల్ జిల్ జిగ
ఇక బస్సులకై వెయిటింగు బస్ స్టాప్ లో చాటింగు వెయిటింగ్ వెయిటింగు
ఇక బస్సులకై వెయిటింగు వెయిటింగ్ వెయిటింగు ఫుట్ బోర్డు ఫయిటింగు
పొద్దున లెగాలీ…

********  *********  *******

చిత్రం: హ్యాపీ డేస్ (2007)
సంగీతం: మిక్కీ జె.మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్

నీ కోసం దిగిరానా  నేనెవరో మరిచన
నేవల్లె కదిలన నేవల్లె కదిలేనా
నాకోసం నేనేన్నైన న సొంతం నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా..
అరె రే అరె రే మనసే జారే  అరె రే అరె రే వరసే మారే
ఇది వరకేపుడు లేదే ఇది నా మనసే కాదె
ఎవరే మన్న వినదే తన గదేడూ తనదే
అంతా నీ మాయలోనే  రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ విన్తలని నీ వాళ్ళనీ
అంతా నీ మాయలోనే…రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలని నీ వళ్ళనీ

స్నేహమేనా జీవితం అనికున్న ఆజ్మేరా ఆశలే కనుగున్న
మనుజులు ఎన్నున ముడి పడి పోతునా
ఇక సెకెండ్ కెన్ని నిమిశాల్లె అనుకుంటూ రోజు గడపల
మదికోరుకున్న మధుబాల చల్లే నీ గోల
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే

ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ

చిన్ని నవ్వే చిత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమై చూస్తున్న
చిటపట చినులుల్లో తడిసిన మెరుపమ్మా
తెలుగింటి లోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవసమ  వరమా హాయ్ రామా
అరె రే అరె రే మనసే జారే
అరె రే అరె రే వరసే మారే
ఇసి వరకేపుడు లేదే ఇది నా మనసే కాదె
ఎవర్మన్న వినదే తన గదేదో తనదే
అంతా మీ మాయలోనే రోజు మీ నామ స్మరణే
ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే
అంతా నీ మాయలోనే  రోజు నీ నామ స్మరణే
ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే

Previous
Eega (2012)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Chittemma Mogudu (1992)
error: Content is protected !!