చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం:
నటీనటులు: అఖిల్ , కళ్యాణి ప్రియదర్శన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేది: 22.12.2017
మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
కురిసే కురిసే కురిసే
నవ్వుల్లో వెన్నెల కురిసే
ఇది కొత్తగా మారిన వరసే
ఆ సంగతి నాకు తెలుసే
సన్నాయి మోగేనా అమ్మాయి
గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా
రావోయి అల్లరి అబ్బాయి
అందుకో ఈ చేయి ఒకటై సందడి చేసేలా
దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)
రెండు గుండెల చప్పుడు ఒకటే
మూడు ముళ్ల ముచ్చట కాగా
ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా
ఏడు జన్మల బంధమిదేలే
ఏడు అడుగులు వేస్తూ ఉంటే
చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా
ఇప్పుడే అల్లెస్తూ హాయిగా తేల్చేగా
బంధాలే ఈ ప్రేమ జంటనిలా
పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా
దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా
అరె షాదియాల వచ్చెరా షురూగిట్ల పరిషాను
సంజైతాలేదా చెప్తా చూడు ఓ కహానీ
పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండె
ఇంక పెండ్లి అయ్యినంక ఆమె కొంగుబట్టి ఊగుడంతే
హోయ్ – అంతే
హోయ్ – అంతే అంతే
మాటలాడనంటది వెయ్యకుంటే సోపు
అందగత్తె లెందరున్న నువ్వేమేటి తోపు అంటు
గాపులేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే
అంతే అంతే
ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో పెట్టెనంట
సప్పగున్న లైఫ్ లోకి అప్పు లొల్లి తప్పదంతే
ఆడిగినన్ని చీరలింక నువ్వుతెచ్చి పెట్టకుంటే
మాటనీది ఇంటిలోన నడవదంతే నడవదంతే
అంతే అంతే అంతే
మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)