చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ , సౌందర్య
దర్శకత్వం: ఈ. వి.వి. సత్యనారాయణ
నిర్మాత: కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 20.04.1994
ఓ…ఓ…ఓ, ఓ…ఓ…ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ…ఓ…ఓ, ఓ…ఓ…ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చరణం: 1
అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూసిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా… ఓ… దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చరణం: 2
సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించూ పదే పదే పలికించూ
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించూ సుఖాలలో తేలించూ
పెదవులతో కమ్మనీ కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా చలే కలుసుకోన
ఓ ప్రియా… ఓ… పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ…ఓ…ఓ, ఓ…ఓ…ఓ
******* ******* ********
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
అట్టా ఎర్రి మొకాలేసి చూస్తారేట్రా వాయించండే…
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ…ఓ…ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ…ఓ…ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ…ఓ…ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ…ఓ…ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ…ఓ…ఓ…, ఓ…ఓ…ఓ…
చూపు చూపుకొక చిటికెల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ…ఓ…ఓ…, ఓ…ఓ…ఓ…
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ…ఓ…ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ…ఓ…ఓ
గవ్వ తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ…ఓ…ఓ…, ఓ…ఓ…ఓ…
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ…ఓ…ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ…ఓ…ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా…
******* ******* ********
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో…
మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిశా తీర్చు గుణపాఠం
చలివేళ ఎద గోల అదిరేలా ఆధారలే అందాలే
చలి బలి లేవోయి చెలి నీదోయి
పెదాలే తేనె జల్లాయే జతలో
మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఓరి తనువా ఇంత చనువా చోటు చెలగాటం
ఓసి మగువా ఉంటే చొరవా లేదు మొగమాటం
తెరతీశా పెనవేశా గురిచూశా పరిచేశా ప్రాయాలే
సొగసరే నీపేరు సరేలే జోరు సరంటూ లేరు సందేల కథలో
మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో…
మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
wow super