Hey Pillagada (2017)

hey pillagada 2017

చిత్రం: హే పిల్లగాడ (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: దుల్కర్ సల్మాన్ , సాయి పల్లవి,
దర్శకత్వం: సమీర్ తాహిర్
నిర్మాత: డి.వి.కృష్ణస్వామి
విడుదల తేది: 2017

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే
వీచే చిరుగాలివా లేదా జడివానవా
నువ్వే తాకేయగా కలలే రేగెనలా
వాలు కనులా వసంత గానమా
కౌగిలివే పోయేలా ప్రాణమా

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే

నిన్నే చూస్తూ ఉంటే ఓ ప్రియం
నిమషమల్లే కరిగేను ఓ యుగం
ప్రణయమా ఆ కడలి గుండెల్లో లోతు అంత
ప్రాణమా నీ మీద నాకు ఉంది ప్రేమ అంత
పువ్వుల్లో నిను దాచుకుంటానులే పసి నవల్లే
నిన్ను చూసు కుంటానులే

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే

నాలో  ఎగసే నా కోపమే అలా
తరిగి పోయే గుర్తొస్తే నువ్ ఎలా
కాలమే ఓ తీపి నవ్వులే పలకరించే
లోకమే నా కెదురుగా వచ్చి తలుపు తెరిచే
ఏముందే నీ జంట నాయనాలలో
నన్ను మార్చావే నీ రంగు స్వప్నాలతో

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే  ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే
వీచే చిరుగాలివా లేదా జడివానవా
నువ్వే తాకేయగా కలలే రేగెనలా
వాలు కనులా వసంత గానమా
కౌగిలివే పోయేలా ప్రాణమా

*******  *******   *******

చిత్రం: హే పిల్లగాడా (2017)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: సింధూరి

ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్
ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా
అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని
నువ్వు గాయం చెయ్యొద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం

అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం

మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు
ఇంకేదో ఐనట్టు గొడవెందుకు
నువ్వే పలికే ఖర్చేమి లేదంట
తప్పేమి కాదంట నవ్వచ్చుగా
నీ అందం నీ ఆనందం
నీ చేతుల్లో ఉండాలంటే
నువ్వింకా వదిలెయ్యాలి కోపం
ఓ సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే చాలురా..
ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్
ఒక చూపుతో చిరుకాంతులే పంచేయ్

పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా
నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే వీడొద్దు నువ్వే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top