Hitler (1997)

చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
నటీనటులు: చిరంజీవి, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణ రావు, రంభ
కథ: సిద్దిక్యు
మాటలు ( డైలాగ్స్ ): ఎల్.బి.శ్రీరామ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సమర్పణ: ఎడిటర్ మోహన్
నిర్మాత: ఎమ్. వి.లక్ష్మీ (ఎడిటర్ మోహన్  భార్య)
సినిమాటోగ్రఫీ: దత్తు
ఎడిటర్: ఆకుల భాస్కర రావు (ఎడిటర్ మోహన్ పర్యవేక్షణలో)
బ్యానర్: యమ్.ఎల్.మూవీ ఆర్ట్స్
విడుదల తేది: 04.01.1997

చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలుపెడితే వన్టూత్రీ
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…

చరణం: 1
అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు
ఎబిసిలు లేని జెడ్ ఏపుగున్న బుగ్గరెడ్డు లేతగున్న నీటిబొట్టు
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే
తనువే పలికే కసి కవ్వాలి నరమే ఒణికే ఎద మనాలి
తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకి పసి మరాళి
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

చరణం: 2
రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేల రంభదంట
నాయుడోరి ఇంటి కాడ నల్లతుమ్మ చెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జతజవానీ పరువం పలికే ప్రియభవాని
తొలిగా పడితే చెలి నిషానీ జరిగే జతులే యమకహానీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…
హే… అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ…

*********  *********  ********

చిత్రం: హిట్లర్ (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, అనుపమ, రేణుక

కన్నీళ్లకే కన్నీరొచ్చే
కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా
ఓ … అన్ని నువ్వై భారం మోయగా
ఈ బరువే నీ చదువై ఎదిగిన పసి కూన

ఓ ఓ ఓ … ఓ ఓ ఓ … ఓ ఓ … ఓ ఓ ఓ … కన్నీళ్లకే
అమ్మ లోని లాలన నాన్న లోని పాలన
అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో
కొమ్మ చాటు పూవులై కంచె చాటు పైరులై
చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో
ముసిరే నిశిలో నడిచే దిశలో
నెత్తురుతో నిలిపావే ఆరని దీపాన్ని

ఓ ఓ ఓ … ఓ ఓ ఓ … ఓ ఓ ఓ … ఓ ఓ ఒ. .. కన్నీళ్లకే
దారి చూపు సూర్యుడా జోల పాడు చంద్రుడా
నీవు కంట నీరు పెడితే నిలువలేమురా
నీరు కాదే అమ్మలు తీరుతున్న ఆశలు
ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవి
ఒడిలో ఒదిగి రుణమై ఎదిగి
మరు జన్మ నిను కని పెంచే అమ్మవుతామయ్య
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ
నా యదలో కాంతుల కొలువమ్మ

ఏ దైవమో దీవించాడు
మా అన్నగా దిగి వచ్చాడు
ఏ జన్మలో రుణమో తీర్చగా
ఓ … మా కోసమే ప్రాణం పంచగా
ఏ పుణ్యం మా కోసం ఈ వరమిచ్చిందో
నీ నవ్వే వెన్నెల వెలుగమ్మ
నా యదలో కాంతుల కోలువమ్మ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Dongodochadu (2017)
error: Content is protected !!