చిత్రం: హౌరా బ్రిడ్జ్ (2017)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: పూర్ణాచారి
గానం: హరిప్రియ
నటీనటులు: రాహుల్ రవీంద్ర , చాందిని చౌదరి
దర్శకత్వం: రేవన్ యాదు
నిర్మాతలు: మాండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాస్, నల్లి కిరణ్ కుమార్
విడుదల తేది: 24.11.2017
రాధా గోపాలా గోకులా బాల రావేరా
మనసు విని రావేరా రావే రావే రాధా మాధవా
హౌరా వారధిలా తేలినది మనసే ఈవేళ
మనవి విని రాధా కృష్ణ రాధా కృష్ణ మురళీ ముకుందా
హృదయలయాలకించరా
ఎదురుపడి స్వాగతించరా
కన్నెకలలల్ని వేచాయి నిన్ను కోరాయి
మూగబోయాయి మాకు తెలుపరా
నిన్నే కోరార కనులు కలలన్ని నీవేరా
తెలుసుకొని ప్రియమారా దరిచేరావే నీవే నేనుగా
మనసున గీశారా నీ ప్రతిమ ప్రధముడు నీవేరా
ప్రతిక్షణము నువ్వే నేనై నేనే నువ్వై పోయా వింతగా