Iddarammayilatho (2013)

చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అపాచి ఇండియన్, షర్మిల
నటీనటులు: అల్లు అర్జున్, అమలా పాల్ , కేథరిన్ త్రేస
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 31.05.2013

సీతా గీతా షీలా మాలా
పేరే ఏదైనా అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే
అస్సలు లేకుంటే కన్నా… లైఫే సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనా
ఐఫీస్టనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయ్‌నా
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతె డూం డూం డూం డూం
లోకానికే ఆక్సిజిన్ అందం అందం… సో…
Run run run run run
Put your hands up n say
let’s have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman

మాటల్లోన కాక్టెయిల్ మత్తుంటాది
ఊపిర్లోన పెర్ఫ్యూమ్ ఘుమ్మంటాది

టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో
మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న సాప్టుగున్న హార్టుంటాది
సూదికన్న షార్పుగున్న చూపుంటాది
అర్థంకాని చిట్టిబుర్రలో
గజిబిజి సుడోకు పజిలుంటాది
బూం బూం బూం బూం బూం
బూం బూబూం
ఎహె ఎన్ని గొప్ప లెక్కలున్నా
ఏంటీ లాభం
ఎళ్లి ఆడికో ఈడికో పడ్డం ఖాయం సో…
Run run run run run
Put your hands up n say
let’s have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman

క్లోరోఫాం అద్దుకున్న కర్చీఫ్‌లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫోం మేట్రెస్‌లాగా
కొందరిది ఎడ్జష్టయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతీ అమ్మాయ్
ఫాస్టుగానే ఉండాలని రూలే లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్ స్లోగానే
ఉంటుందన్న గ్యారెంటీ లేదు
బూం బూం బూం బూం బూంబ బూం బూబూం
వీళ్లనెస్టిమేట్ చెయ్యడం చాలా కష్టం

ఈ లైఫ్‌టైం చాలదీ సబ్జెక్ట్ కోసం రన్ రన్ రన్…
Run run run run run
Put your hands up n say
let’s have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman

*********   *********   *********

చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్ , గీతా మాధురి

అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..
మంచి బీటొస్తాది పిచ్చ పాటొస్తాది
అబ్బాయ్ మనసునే అమ్మాయ్ లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది..
మస్త్ మాసొస్తాది బెస్ట్ ఊపొస్తాది…

రాయే రాయే నా రాకాసీ…
నువ్వే పైటేసీ అట్టా దోపేస్తే
టాపు లేసిపోద్ది… పోద్ది… పో… పో…

టాపు లేసిపోద్ది… పోద్ది… పో… పో…
రారో రారో నా శివకాశి…
అగ్గిరాజేసీ… సిగ్గుపేల్చేస్తే…
టాపు లేసిపోద్ది… పోద్ది… పో… పో…

టాపు లేసిపోద్ది… పోద్ది… పో… పో…
చెట్టు మీద మ్యాంగోలా… నువ్వెంత సక్కగున్నావే
చాకులాంటి పిల్లాడే… ఎంతషార్ప్‌గున్నాడే
చాకొచ్చీ మ్యాంగో కోస్తే…
టాపు లేసిపోద్ది… కన్నే కొట్టావంటే

టాపు లేసిపోద్ది… ముద్దే పెట్టావంటే
టాపు లేసిపోద్ది… చెయ్యే పట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో…

అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..
మంచి బీటొస్తాది పిచ్చ పాటొస్తాది

ఏయ్… సమ్మర్లోనా లస్సీలా వింటర్లోనా కాఫీలా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే
పిల్లా పొంగేపొంగే పూరీలా
రాంబోకేమో తమ్ముళ్లా… జాకీచాన్ అల్లుళ్లా
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అబ్బో బ్రేకుల్లేని లారీలా
రాయే రాయే నా రాకాసీ…
అట్టా నవ్వేసీ గుండె తవ్వేస్తే
రారో రారో నువ్ చిటికేసి
షర్టు మడతేసీ కాలరెగరేస్తే
టాపు లేసిపోద్ది… ఓణీ కట్టావంటే
టాపు లేసిపోద్ది… పూలే పెట్టావంటే
టాపు లేసిపోద్ది… ఈలే కొట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో…

ఏయ్… కోతికేమో కొబ్బర్లా… పిల్లాడికి బర్గర్లా…
నచ్చేస్తున్నావే.. కల్లోకొచ్చేస్తున్నావే…

అరె కొత్త ఫిలిమ్ ట్రైలర్లా
పోలీసుకీ రౌడీలా… ఆడోళ్లకీ చాడీలా
బుక్కైపోయావే నాకు సెట్టైపోయావే
సోడాబుడ్డిలోని గోళీలా
రాయే రాయే నా రాకాసి…
గోళ్లుకొరికేసీ ఒళ్లు విరిచేస్తే
రారో రారో నువ్ ఇటుకేసి
ప్యాంటు మార్చేసి లుంగీ కట్టేస్తే
టాపు లేసిపోద్ది… కాటుకెట్టావంటే
టాపు లేసిపోద్ది… గాజులేశావంటే
టాపు లేసిపోద్ది… గోడే దూకావంటే
టాపు లేసిపోద్ది… డోరే కొట్టావంటే
టాపు లేసిపోద్ది… టాపు లేసిపోద్ది…
టాపు టాపు టాపు… టాపు లేసిపోద్ది…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Major Chandrakanth (1993)
error: Content is protected !!