చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, వాణిశ్రీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఆర్.పుత్తన్న కనగల్
నిర్మాణం: యునైటెడ్ ప్రొడ్యూసర్స్
విడుదల తేది: 02.10.1972
పల్లవి:
నా హృదయపు కోవెలలో…. ఆ… ఆ
నా బంగారు లోగిలిలో…. ఆ… ఆ
ఆనందం నిండెనులే… అనురాగం పండెనులే
నా హృదయపు కోవెలలో… నా బంగారు లోగిలిలో… ఆ ఆ
ఆనందం నిండెనులే… అనురాగం పండెనులే
ఆ…ఆ… హా…
నా హృదయపు కోవెలలో…
చరణం: 1
ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో… మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో… మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో…
సొగసును మించిన సుగుణముతో… నా మనసును నిలువునా దోచితివే
నా హృదయపు కోవెలలో…
చరణం: 2
అహహ…ఆహాహా…ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం… నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం… నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే…
లక్ష్మి సరస్వతి నీవేలే… నా బ్రతుకున కాపురముందువులే
నా హృదయపు కోవెలలో…
చరణం: 3
ఆహా..ఆ..ఆ…
ఇంటికి నీవే అన్నపూర్ణగా… ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా… ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో…
వచ్చే పోయే అతిధులతో… మన వాకిలి కళకళలాడునులే
నా హృదయపు కోవెలలో… నా బంగారు లోగిలిలో…
ఆనందం నిండెనులే… అనురాగం పండెనులే
నా హృదయపు కోవెలలో…
***** ***** *****
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల
పల్లవి:
ఈ చల్లని లోగిలిలో… ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి… అనురాగం పండాలి… అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో… ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి… అనురాగం పండాలి … అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో…
చరణం: 1
పిల్లల పాపల అల్లరితో… ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో… ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా…
పసుపు కుంకుమ కొల్లలుగా… ఈ పచ్చని ముంగిట కురవాలి
ఈ చల్లని లోగిలిలో ….
చరణం: 2
శుభముల నొసగే ఈ మందిరము… శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము… శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా … ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి ….
ఈ చల్లని లోగిలిలో ….
చరణం: 3
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా…. ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా…. ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో….
వచ్చే పోయే అతిధులతో… మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి
ఈ చల్లని లోగిలిలో…. ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి… అనురాగం పండాలి… అనురాగం పండాలి