చిత్రం: ఇద్దరు మొనగాళ్ళు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: కృష్ణ , కాంతారావు, కృష్ణకుమారి, సంధ్యారాణి
దర్శకత్వం: బి.విఠలా చార్య
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 03.03.1967
పల్లవి:
చిరు చిరు చిరు చిరు నవ్వులు
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు… విరి చూపులు
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు… విరి చూపులు
చరణం: 1
మల్లె తీగ నడిచిందంటే…
నడిచిందంటే..నడిచిందంటే.. నడిచిందంటే
మల్లె తీగ నడిచిందంటే..
కల్ల మాట అనుకున్నాను
నీవు నడిచి పోతూ ఉంటే
నిజమే అనుకున్నాను
చిలిపి మదనుడున్నాడంటే…
ఉన్నాడంటే…ఉన్నాడంటే… ఉన్నాడంటే
చిలిపి మదనుడున్నాడంటే
కలయేమో అనుకున్నాను
నిన్నెదురుగా చూస్తూ ఉంటే
నిజమే అంటున్నాను
ఓ…ఓ..ఓ…ఓ..ఓ…
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
ఓహొ ఓహొ ఒహో
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు… విరి చూపులు
చరణం: 2
మేడలోన నీవున్నావు..
నీవున్నావు…నీవున్నావు… నీవున్నావు
మేడలోన నీవున్నావు.. నీడలోన నేనున్నాను
నిండు వలపు నిచ్చెనవేససీ…
నిన్నే కనుకొన్నాను
పలకరించు జాబిలి నీవు
జాబిలి నీవు…జాబిలి నీవు… జాబిలి నీవు
పలకరించు జాబిలి నీవు…పరవశించు కలువను నేననూ
నిన్నే కనుకొన్నాను
ఓ…ఓ…ఓ…ఓ..
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి చూపులు
నను కలవరపచే చూపులు..విరి చూపులు
చిరు చిరు చిరు చిరు నవ్వులూ….