Idi Naa Love Story (2017)

చిత్రం: ఇది నా లవ్ స్టోరీ (2017)
సంగీతం: శ్రీనాథ్ విజయ్
సాహిత్యం: రామాంజనేయులు. వి.వి
గానం: శక్తిశ్రీ గోపాలన్
నటీనటులు: తరుణ్ , ఓవియ
దర్శకత్వం: రమేష్ గోపి
నిర్మాత: యస్.వి.ప్రకాష్
విడుదల తేది: 2017

కన్పించినప్పుడల్లా ఏడ్పించాను
ఇప్పుడు తను కన్పించకుండా నన్ను ఏడ్పిస్తున్నాడు
మిస్ యు అనే పదానికర్థం నాకప్పుడే తెలిసింది

ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు
ఐ మిస్ యు నిన్నెంతగానో
ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే
నా డ్రీమ్స్ ఏమో నీతోటి నిండే
నా హార్టేమొ  ఆ మాట దాచే
ఈ సీక్రెట్ నీతోనే చెప్పే రోజే ఎప్పుడో…
నీ స్మైలేమొ నాకోసమంటే నీ ఫీలింగ్స్ నా పైన ఉంటే
ఈ లైఫంత నాతోనే ఉంటే అంతే చాలులే

ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు
ఐ మిస్ యు నిన్నెంతగానో
ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే

చరణం: 1
నువ్వు నేనని విడదీసే దూరం ఎంతని
నేనే నువ్వని ముడి వేసే బంధం ప్రేమని
ఏ చోటే నువ్వున్నా పరుగున ఒడి చేరవా
నా వెనకే దాక్కున్నా చిటికైనా వేయవా
నా కళ్ళే నీకై వేచే రాత్రంతా నిదురే రాదే

ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు
ఐ మిస్ యు నిన్నెంతగానో
ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే

చరణం: 2
ఏదో సందడి నువ్విచ్చెల్లావు గుండెకే
ఏంటీ తొందరే నువ్వొచ్చేదాక ఆగదే
నా లోనే ఈ ప్రేమ నిలువదు ఇక ఆపినా
నీ పైనే నా ప్రేమ ఎదురైతే చూపనా
ఈ ఊపిరి నాదే అయినా నీతోనే ముడిపడి ఉంది

ఈ వెయిటింగ్ ఇంకెంత సేపు
ఐ మిస్ యు నిన్నెంతగానో
ఐ లవ్ యు చెప్పాలి నీతో రావా చంతకే

********  *******  *******

చిత్రం: ఇది నా లవ్ స్టోరీ (2017)
సంగీతం: శ్రీనాథ్ విజయ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో

నా మనసె దోచి మెరుపేదొ ఉంది నీ చిరునవ్వులో
నే పిలిచే లోపె తొలిప్రేమె నువ్వై
కలువయ్యవు నా చిన్ని ఎదలొ
నిన్నె తలచి మైమరచిపొయ నా ప్రతి ఊహలో
నేనెవరొ ఎమొ గుర్తేమొ రాదు అంతే లేని నీ తీపి కలలో

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో

నువ్ చూసె చూపులతోనె గుండెలొ వింత అలజడి
నీ పెదవుల మాటలతోనె నీ వైపుకె నన్ను లాగెనె
నువ్ తాకిన క్ష్నమె నాలొ మనెసేమొ ఈల వేసెనె
నా నీడలొ నాకు బదులుగ నిన్ను చూసానులె
చలిలోని చిన్న మంటల ఎదురైతె ఏమి చేయనె
నలువైపుల చిలిపి మత్తుగ మెలుకువె రాని కలలొ ముంచావె

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో (2)

ఏ దిక్కున నువ్వున నీ పక్కనె ఉన్న జంట నీడగ
ఏ వైపుకు వెలుతున్న నే వస్తున్న నీ అడుగు జాడగ
నీ పేరె పెదవి తీపిగ ప్రతి నిమిషం పలికి చూడన
నా మనసె పూలదారిగ నిన్ను నడిపించన
నువ్ లేక నేను లేనులే ఊపిరిలో నిన్ను ఉంచన
నా ప్రేమకు హద్దులేదులె
నువ్విలా నన్ను చేరిన సమయాన

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో  (2)

నా మనసె దొచి మెరుపేదొ ఉంది నీ చిరునవ్వులో
నే పిలిచే లోపె తొలిప్రేమె నువ్వై
కలువయ్యవు నా చిన్ని ఎదలో
నిన్నె తలచి మైమరచిపొయ నా ప్రతి ఊహలొ
నేనెవరొ ఎమొ గుర్తేమొ రాదు అంతే లేని నీ తీపి కలలో

యే నిమిషంలో నిను చూశానో పడిపోయ ప్రేమలో
మరు నిమిషంలో మనసిచ్చేశా మతి పోయె మాయలో (2)

Previous
Lie (2017)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Pelli Sandadi (1996)
error: Content is protected !!