చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకులు: పుహళేంది
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ, శారద, కాంచన , బేబీ వరలక్ష్మీ
కథ, మాటలు ( డైలాగ్స్ ): మోదుకూరి జాన్సన్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాపయ్య
అసోసియేట్ డైరెక్టర్: బీరం మస్తాన్ రావు
నిర్మాతలు: నన్నపనేని సుధాకర్ , టి.సుబ్బానాయుడు
సినిమాటోగ్రఫీ: పి.భాస్కరరావు
ఎడిటర్: నరసింహా రావు
బ్యానర్: ఉదయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 14.01.1978
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: పి.సుశీల
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు
పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు
నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు
ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు
ఆ ఆశలన్ని ఆకాశానికి
ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఇంద్రధనుసై
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు
వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా
వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో
ఇంద్రధనుసై నాలో
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు
****** ****** ******
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా
పూలదండకే ఇంత పులకరింతా
చల్లగాలికే ఇంత జలదరింతా
పూలదండకే ఇంత పులకరింతా
చల్లగాలికే ఇంత జలదరింతా
కళ్ళు తెరుచుకున్నా కలవరింతా
కళ్ళు తెరుచుకున్నా కలవరింతా
కలలు రాకపోయినా పలవరింత
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా
పరిచింది నీ నవ్వు పాలపుంత
పాకింది బుగ్గలలో జేవురింతా
పరిచింది నీ నవ్వు పాలపుంత
పాకింది బుగ్గలలో జేవురింతా ఆ
కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ
కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ
కానుక ఇస్తుంది కన్నెవయసునంతా
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా
నా చూపే వస్తుంది నీ వెంట
నీ రూపే ఉంటుంది నా చెంత
నా చూపే వస్తుంది నీ వెంట
నీ రూపే ఉంటుంది నా చెంత
నీతోనే నిండింది హృదయమంతా ఆ
నీతోనే నిండింది హృదయమంతా
నాతోడై ఉండాలి కాలమంతా
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా
****** ****** ******
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నానా
దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని