Indrudu Chandrudu (1989)

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కమల్ హాసన్, విజయశాంతి, శ్రీవిద్యా
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 24.11.1989

కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను
డిగ్రీల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
రికార్డు డాన్సులో బ్రేకులేచేసి రికార్డు బ్రేకు చేశాను
మైకేలు జాక్సన్ ని ఆ మైక్ టైసన్ ని గోదాట్లో తోసి వచ్చాను..

చరణం: 1
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు నా రంగి అరె మరదలు నా రంగి
చుక్కపూల తోటలో తనువుల తప్పట్లలో
మంచమేసి కలుపుకో మనసులు తీరంగా అహ మరిది విషాదంగా
మావ లేనప్పుడు అత్తమ్మో నువ్వు రారాదా పోరాదా రత్తమ్మో
రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారాదా పోరాదా సారంగా

చరణం: 2
బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి
నువ్ ఏడపోతావ్ మొగుడో నాజూకు చక్కనోడా
బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి
నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా

పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా
పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే

*********  *********   ********

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా

చరణం: 1
నీ చలి నా గిలి ఓపలేను అందగాడా
నీ శృతి నా లయ ఏకమైన సందెకాడ
అంటినా ముట్టినా అమ్మగారూ
అగ్గిపై గుగ్గిలం నాన్నగారు
ఎంత పడి చస్తున్నానో వెంటపడి వస్తున్నాను
తెలిసిందా ఓ కుర్రోడా దక్కనివ్వు నా మర్యాద
ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ జెండా

చరణం: 2
వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ
బుట్టనీ మట్టనీ ఆగదమ్మ పూల ప్రేమ
అందుకే సాగనీ రాసలీల
అందమే తోడుగా ఉన్న వేళ
ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో
తెలిసాకే ఓ అమ్మాయి కలిసాయి చేయి చేయి
కానిలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయనా

*********  *********   ********

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి (2)
తెలుసా………..ఈ ఊసు
చెబుతా తల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనికుండా పట్టుకో నా చేయి

చరణం: 1
మాయలే నమ్మింది బోయతో పోయింది
దయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడ దారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

చరణం: 2
పిల్లలు ఇల్లాలు ఎంతగా ఎడ్చారో
గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు
నేరం నాదైనా
భారం నీ పైనా
తండ్రినే నేనైనా దండమే పెడుతున్న
తల్లిలా మన్నించు మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా…..

*********  *********   ********

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్డంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రయ్యంటూ పదం వింటూ పదా అంటూ

చరణం: 1
వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరోకో
పదరో చిటపటలాడే ఈడుకు చిక్కిదిగో
కసితో కుతకుత ఉడికే కళ్ళకి విందిదిగో
ఎదలో కితకిత పెట్టే కన్నెల చిందిదిగో
చెక్కిలి నొక్కుల చెక్కులలో చిక్కని మక్కువ చిక్కునురో
చక్కిలిగింతల తోక్కిడిలో ఉక్కిరిబిక్కిరి తప్పదురో
అక్కర తీర్చే అంగడిలో అద్దాల అందాలు అందాలి కదరా

చరణం: 2
సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానీరో
మరిగే కలతకు జాణల దాణా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదుర వొల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా
అత్తరు సోకి కత్తెర రా కొత్తంగా మెత్తంగా కోసింది కదరా

*********  *********   ********

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన

చరణం: 1
చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే
కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగ స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా…

చరణం: 2
ఎదుటపడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
ఒణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదైపోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Rajanna (2011)
error: Content is protected !!