చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: సినారె
గానం: యస్.పి. బాలు
నటీనటులు: చిరంజీవి , మాధవి , గొల్లపూడి
దర్శకత్వం: కోడిరామకృష్ణ (మొదటి సినిమా)
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 22.04.1982
పల్లవి:
హాఁ..ఆ..ఓ.. అజంతా వెలవెలబోదా… ఎల్లోరా తల్లడిల్లదా
కాశ్మీరం కలవర పడదా… తాజ్మహల్ తడబడి పోదా
ఆ..ఆ..ఆ.. హాయ్ హాయ్.. ఆ..ఆ..ఆ..
ఒక వనిత… నవ ముదిత… సుమ లలిత… రస భరిత
ఒక వనిత… నవ ముదిత… సుమ లలిత… రస భరిత
అలిగితే ఏమవుతుంది… అందం నాగు పామౌతుంది
గోరింకా… హహహ… ఓ గోరింకా… హేయ్…
గోరింకా… హా… ఓ గోరింకా… హా..హా..హా..హా..
చరణం: 1
ఆ… కొసవేళ్ళ సవరణ నోచుకున్నా… కురులదేమి భాగ్యమో
ఆ… అడుగుల నునుపు ముద్దాడుకున్నా… గడపదెంత సౌభాగ్యమో… ఆ..ఆ..
అది కంటి మెరుపో… ఆ బ్రహ్మ గెలుపో
అది కంటి మెరుపో… ఆ బ్రహ్మ గెలుపో
కాకా… కాకా… కాకా…
లల్లలా… లల్లలా… లల్లలా… లర లా…
అలిగితే ఏమౌతుంది ఉదయమే నడిజామౌతుంది
గోరింకా… ఓ గోరింకా… హోయ్… ఊఁహహ…
గోరింకా… హా… ఓ గోరింకా… హా..హా..హా..హా..
చరణం: 2
ఆ… అలివేణి మోమును చూసిన… అద్దానిదెంతటి పుణ్యమో
ఆ… చెలి నుదుటను ముద్దుగ దిద్దిన.. తిలకానిదెంతటి లావణ్యమో…ఆ…ఆ…
ఆ రంభ రూపం… అపరంజి శిల్పం…హ హ
ఆ రంభ రూపం… అపరంజి శిల్పం…హ హ
ఆ చంద్ర వదన… ఆ కుందరదన… ఆ కమల నయన… ఆ కాంతి సదన
నవ్వితే ఏమౌతుంది… నవ్వే నవ్వుకు నవ్వౌతుంది
గోరింకా… హే గోరింకా…హ..హ..హ..
గోరింకా…
హా చాలింకా…హ..హ..హ..
****** ******* *******
చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు
పల్లవి:
మాటంటే బాణం.. ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి.. ఎత్తిన అవతారం..ఊ
మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
డండర డండర డాండాండ.. డండర డండర డాండాండ
డండర డండర డాండాండ.. డండర డండర డాండాండ
చరణం: 1
భార్య అడిగితే ఏది లేదనను.. బంగారు లేడి తెమ్మన్నా కాదననూ..
హా..ఆ ఆ హా హా.. ఆహ..ఆహ..ఆహ..హా..ఆ..ఆ
భార్య అడిగితే ఏది లేదనను.. బంగారు లేడి తెమ్మన్నా కాదననూ..
ఇల్లు దాటితే నేను.. నేను కాను..హ..హా..ఇల్లు దాటితే నేను.. నేను కాను
ఎన్ని పడకగదులు ఏలుతానో చెప్పలేను.. అసలే చెప్పలేను
అందుకే మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
చరణం: 2
ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను..ఊ..ఊ
పది తలలెదురైనా ఎగురగొట్టుతాను
ఆ..ఆ..ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను.. పది తలలెదురైనా ఎగురగొట్టుతాను
మనసైతే మురళిని చేపట్టుతాను..
మనసైతే మురళిని చేపట్టుతాను..
వేల మంది గోపికలకు గజ్జ కట్టుతాను.. గజ్జ కట్టుతానూ..
హా..ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
చరణం: 3
ఒక్క భార్య వున్నవాడు దేవుడే.. మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే
ఆ..ఆ హా హా..ఆ..ఆ ఆహ ఆహ ఆహ..హా..ఆ
ఒక్క భార్య వున్నవాడు దేవుడే.. మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని..
ఆ ఇద్దరు దీవించిన చిరంజీవిని..
విల్లు వేణువు పట్టిన సవ్యసాచిని.. అపర సవ్యసాచిని
అందుకే మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
మాటంటే బాణం.. ఏ మగువన్నా ప్రాణం
ఆ ఇద్దరు దేవుళ్ళు కలసి.. ఎత్తిన అవతారం
మనం..
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యా
డరడ డరడ డడడ.. డడ్డర డడ్డర డడడ
డడ.. డడ.. డడ.. డడ.. డండరడాడ.. డండరడడ..