చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: హరిహరణ్, సైందవి
నటీనటులు: నితిన్, నిత్యామీనన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్
విడుదల తేది: 24.02.2002
సూటిగా… చూడకు
సూదిలా… నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
సూటిగా… చూడకు
సూదిలా… నవ్వకు
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేల పై మహారాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం అడుగేయగా
అంతా నీ వల్లే నిమిషంలో మారిందంట
బంతి పూవల్లే నా చూపే విచ్చిందంట
సూటిగా… చూడకు
సూదిలా… నవ్వకు
సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే
గంటలో మొదలైంది కాదు ఈ భావన
గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా… చూడకు
సూదిలా… నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
******** ******** *********
చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: అనూప్ రూబెన్స్, రాజ్ హాసన్, శ్రావణి
హో తేరె బిన్ జానా
కుచ్ బి నహి మేఁ
ఇష్క్ మేఁ, మేఁ దీవాన
ఆలె బా ఆలె బా
ఆలె ఆలె ఆలె ఆలె బా
తన్నాన ననన ఆలె బా
తన్నాన ననన ఆలె బా
ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే
అదిరే అదిరే నా మనసే ఎదురు చూసే
చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం
చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం
నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్నా నేను
చిన్నవాడ నీకోసం చిన్నవాడ నీకోసం
మాటలన్ని నీకోసం మౌనమంత నీకోసం
చరణం: 1
ఓ కూ అనే కోయిలా ఉండదే రాయిలా
కొత్తపాట పాడుతుందిలా
తీయని హాయిలో తేలని గాలిలో
పెళ్లిదాక పరిచయం ఇలా
హే ఎటువైపెళ్లినా నే నిన్నే చేరనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
హో జాజికొమ్మే నాచెలి జావళీలే పాడెనురో
ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో
వేకువంత నీకోసం వెన్నెలంత నీకోసం
ఊసులన్ని నీకోసం ఊపిరుంది నీకోసం
ఆలె బా ఆలె బా
ఆలె ఆలె ఆలె ఆలె బా
చరణం: 2
ఓ ప్రేమ పుస్తకాలలో లేనేలేని పోలిక
రాయడం కాదు తేలిక
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా
చాల్లే తికమక అల్లుకుపోవే
ఓ గాలిలోనే రాసినా
మన ప్రేమ అయితే చెదరదులే
అలలు అడుగున మునిగినా తీరం చేరదులే
కాదల్ అయిన నీకోసం – నీకోసం
ప్రేమ అయిన నీకోసం – నీకోసం
లవ్ యూ అయిన నీకోసం – నీకోసం
ఇష్క్ అయిన నీకోసం – నీకోసం
******** ******** *********
చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అద్నాన్ సామీ, నిత్యా మీనన్
యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని
ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా
తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో
ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా
ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)
ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్
ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా
ప్రాయం నిన్నేదో సాయమడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేనూ
ఏమంటావో ఏమంటావో…
ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)
ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్…
యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని
ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే
నీ చెలిమే చనువై చేరుకోలేవా
ఉన్నా నీకందరు నాలా ప్రేమించరు
నీకు నేనున్నా రా బంగారు
ఏమౌతానో నీ మాయలో…
ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా
యూ ఆర్ మై ఎవ్రీథింగ్ (4)
ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్…
ఓ ప్రియా ప్రియా ప్రియా ప్రియా
******** ******** *********
చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణచైతన్య
గానం: అనూప్ రూబెన్స్ , నితిన్ , తాగుబోతు రమేష్, మురళి
ఏ గానా
లడికీయోమ్ కేలియె నహీ
ప్లీజ్ నహీ సున్ నా ప్లీజ్…
బాబ్ యోవ్ హే (2)
కోడిబాయె లచ్చమ్మది – యో
కోడిపుంజుపాయె లచ్చమ్మది – అరె
తోటబాయె లచ్చమ్మది – అవునా
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో
కోడిబాయె లచ్చమ్మది
కోడిపుంజుపాయె లచ్చమ్మది
గుడ్డుపాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో
బోలో బోలో
కోడి కోడి కోడి
కోడిబాయె గుడ్డుపాయె
వన్స్ అప్పాన్ ఏ టైమ్
నాకొక అదిరే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదిరో
మా ఇద్దరిమధ్య గొడవై బ్రేకప్ అయి పోయిందిరో
మూడేదొబ్బి పబ్బుకు వస్తే
అమ్మాయి కావాలన్నారురో
స్టాగ్‌తో ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారురో
ఏంచెయ్యనూ బోలో క్యాకరు బాయ్
ఐ వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ ఉయ్ వన్నా బ్యూటీరో
ఐ వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ ఉయ్ నీడ్ బ్యూటీరో
లచ్చమ్మ ఉయ్ వాంట్ లచ్చమ్మ
అరె అన్నా కాలి లేడీస్ నైట్
క్యోం లగాతే అన్నా
అపన్ కో జెంట్స్ నైట్ న హీ
హే క్యా అన్నా అరె హే క్యా అన్నా
బోలో బోలో భయ్యా
ఓ… బాయ్సే లేరంటే పబ్బుకి
ఇన్కమ్ లేనేలేదురో
ఫ్రీగా డ్రింక్స్ వస్తే వచ్చి తాగివాళ్లే ఈ గర్ల్స్రో
లేడీస్ నైట్ అని దీనికి మళ్లీ పెట్టారు ఓ పేరురో
కావాలంటే క్యాషిస్తాం జెంట్స్ నైటు కూడా
పెట్టండిరో
ఒకే సద్దా హాక్ ఎత్తె రాక్
ఐ వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ ఉయ్ వన్నా బ్యూటీరో
అరెచుప్ ఇదేం గోలరాభయ్
అన్నా నువ్ సింగ్ అన్నా
ఊఁ… గర్ల్సు గర్ల్స్ వస్తే
ప్లీజ్కమ్ అని వెల్కమ్ చేస్తారురో
ఆ… బాయ్స్ బాయ్స్సొస్తే
బై బై దొబ్బేయ్ అని అంటారురో
క్యాబాత్ హై
గర్ల్స్ అంతగ్రేటా బాయ్స్ అంత వేస్టా
ఐవాంట్ నో రైట్ నౌ రో
గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని
యు బెటర్ నో రైట్ నౌ రో
వాట్ యూ సే బోలో వాట్ యూ సే
ఐ వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో అ భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ ఉయ్ వన్నా బ్యూటీరో
లచ్చమ్మ ఉయ్ వాంట్ లచ్చమ్మ
******** ******** *********
చిత్రం: ఇష్క్ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: ప్రదీప్ విజయ్, కళ్యాణి నయర్
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
నిన్నకి నేటికి ఎంతగా మారెనో
నిన్నలో ఊహలే ఆశలై చేరెను
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
అడుగడుగున నిన్ను కంటున్నా
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా
చివరికి నేనే నువ్వు అవుతున్నా
ఎందుకో ఈ తీరుగా మారటం
ఏమిటో అన్నింటికీ కారణం
బదులు తెలిసుంది ప్రశ్న అడిగేందుకే
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి
గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి
కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి
నవ్వులోన తల దాచుకుంటుంది
అక్కడే ఆగింది ఆ భావన
దాటితే ఏమౌనో ఏమో అనా
ఎందుకాలస్యం ఒక్క మాటే కదా
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో
నిన్నకి నేటికి ఎంతగా మారెనో
నిన్నలో ఊహలే ఆశలై చేరెను
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో