ఆనందమానంద మదికే… లిరిక్స్
చిత్రం: ఇష్క్ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్, సత్య యామిని
నటీనటులు: తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్
దర్శకత్వం: ఎస్ ఎస్ రాజు
నిర్మాణం: ఎన్.వి ప్రసాద్, పరస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
విడుదల తేది: 2021
Aanandam Madike Song Telugu Lyrics
ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా… ఓ ఓహో ఓఓ
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా… ఓ ఓహో ఓఓ
మెత్తనైన నీ పెదవులపై… నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా, హో
రెండు కన్నులెత్తి గుండెలపై… నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా… విడువలేనే నేనిలా, ఆఆ ఆ ఆ
ఆనందమానంద మదికే… ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే… ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా, ఆఆ ఆ
మిలమిల మెరిసే కనుచివరలే మినుకుల్లా
విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా… దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా స్వరాలూ పూసేనా… ఓ ఓ
ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా… ఆ ఆఆ
ఆనందమానంద మదికే… ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే… ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా, ఆఆ ఆ
Ishq Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Aswome song really liked sid Sriram Sir voice correctly suited and lyrics wonderful.. I liked well
is a nice song. and lovely music. am really empressed.😍😍