Jaanu Movie Telugu Lyrics

Jaanu (2020)

Jaanu Movie Telugu Lyrics

ద లైఫ్ ఆఫ్ రామ్… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

The Life Of Ram Telugu Song Lyrics

ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా…
ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా.

ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా..
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..

కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా…
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా….
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై
నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా…

నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా ..
కాలం ఇపుడే నను కనదా..

అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా..

గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక ..
కాలు నిలవదు యే చోటా..
నిలకడగ యే చిరునామా లేక …
యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా

నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం..
నాకే సొంతం అంటున్నా… విన్నారా …
నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న …
రాకూడదు ఇంకెవరైనా..

అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న…
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి…

తానే.. నానే.. నానినే…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఊహలే ఊహలే నిను విడవవులే… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి, గోవింద్ వసంత
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Oohale Oohale Telugu Lyrics

పియా… బాలము మోరా…
పియా… మోరా… బాలము

పియా… ఘర్ ఆవో… ఘర్ ఆ…
పియా… ఘర్ ఆ ఆ జీ…
బాలమ మోరా…
బాలము మోరా… పియా…
పియా హ… బాలము మోరా మోరా

ఆ ఆ… చిన్ని మౌనములోన… ఎన్ని ఊగిసలో…
కంట నీరు లేని… రోజు కలిసెనే…
ప్రాణములో… ప్రాణ సడే…

ఊహలే ఊహలే… నిను విడవవులే…
గుండెకే ప్రాణమై… పూసే పూసే…
ఊహలే ఊహలే… నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ… ఆ ఆ ఆ…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ప్రాణం.. నా ప్రాణం… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి, గౌతమ్ భరద్వాజ్‌
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Pranam Naa Pranam Song Telugu Lyrics

ప్రాణం… నా ప్రాణం నీతో ఇలా..
గానం… తొలి గానం పాడే వేళ..

తారా తీరం… మన దారిలో కాంతులే కురిసేలా.
చాలా దూరం… రాబోవు ఉదయాలనే విసిరేలా..

ప్రాణం… నా ప్రాణం నీతో ఇలా..
గానం… తొలి గానం పాడే వేళ..

మన బాల్యమే ఒక పౌర్ణమి… ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే… చెరో కథై ఇలా..

మళ్ళి మళ్ళి జాబిలి వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల

తారా తీరం… మన దారిలో కాంతులే కురిసేలా.
చాలా దూరం… రాబోవు ఉదయాలనే విసిరేలా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నా కలే కలై నన్నే వదిలే… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: బృంద
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Naa Kale Kalai Song Telugu Lyrics

నా…కలే కలై నన్నే వదిలే..
నే…నిలా ఎలా ఎలా నమ్మనీ…
నిజమే.. కుదురు చెదిరింది లే…

కలత తొలిసారిలా నాలోపలే…అయ్యానులే శిలై…
ఎదురుపడవే నువ్వే… మదికి వివరించవే.. నిజం ఇదేనని..

బదులే నువ్వే… నా జతగా నువ్వే లేక
తరగతి గది గతై మారేనే… ఇలా
నీ మరుపే గురుతే రాక… మది పదే పదే నిన్నే వెతికెనే వలలా…

అసలు ఇది ఎవరి నేరమా… ఎలా అడగను
కనుల నది దాటు నీరు నే ఎలా నిలుపను…

మనసుకిది ఎంత భారమో… ఎలా తెలుపను…
సెలవికనే ఎంత సులువుగా… ఎలా నమ్మను…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఇంతేనా ఇంతేనా… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Inthena Jaanu Movie Song Telugu Lyrics

ఇంతేనా ఇంతేనా ఒక మాటైనా మాటాడవేదైనా
ఇంతేనా ఇక ఇంతేనా… ఎన్ని ఆశలతో ఆలా నువ్వు నీ చెంతనా…

కాలమే మారెనా… దూరమే చేరినా
వసంతమేగిరే ఎడారి ఎదురైనా…
ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే…
ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే…

సూటిగా చూపదే నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే
ఎలా చెప్పాలి? ఎలా అడగాలి? ఆటలాడేటి రాతల నువ్వే

పాఠాలు చదివిన కాలం నువ్వే…
పాఠాలు నేర్పిన కాలం నువ్వే…
అర్ధం అవ్వనీ పాఠమల్లే… ప్రతి క్షణం నా నువ్వే…

సంద్రాలు దాటేను నా రెక్కలే… తీరాలు తాకేను నా పరుగులే…
మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగేనే..

రేపటి ఊహలు నిన్నటి ఆశలే… కన్నీటి పాటల నిన్ను దాటనులే…
ఈరోజు కోసం వీచింది నా ప్రాణమే… ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి శ్రీపద, గోవింద్ వసంత
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Komma Veedi Song Telugu Lyrics

కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె… పువ్వు కంట నీరే కురిసే
అమ్మ ఒడి వీడే పసిపాపలా… వెక్కి వెక్కి మనసే తడిసే…

చదివే బడికే వేసవి సెలవులా… తిరిగి గుడికే రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమై మన కలలు ఇలా…ఆ ఆ
ముందరున్న కాలం గడిచేది ఎలా… బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా…

కన్ను వీడి చూపే వెళుతోందిలే… కంట నీరు తుడిచే-దేవరే…

చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే… నిను విడువని.. ఏ నన్నో వెతికేనులే…
చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే… మన ఊసులే జతలేక ఎడబాసెలే

నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా
వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే…

మనం మనం చెరో సగం… చెరో దిశల్లే మారినా
ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా…
నువున్న వైపు తప్ప… చూపు తప్పు దిశను చూపునా…

అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచేనా…
మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన…
చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు
కవితలే రాసే నీకై మల్లీ రా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఈ ప్రేమలే అనంతమే… లిరిక్స్

చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: శ్రీమణి
గానం: చిన్మయి శ్రీపద, గోవింద్ వసంత
నటీనటులు: శర్వానంద్‌, సమంత
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్
నిర్మాణం: రాజు, శిరీష్
విడుదల తేది: 2020

Jaanu Movie Ananthame Song Telugu Lyrics

కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటే… ఏమో కదా…
యుగాల ప్రేమ జాగాలనేలుతోంది రాజు లాగ శపించు వరమా…

పూసే పువ్వోటి చాలే.. లోకాన్ని గెలిచి చూపుతోందే…
తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే…
ఈ ప్రేమ కార్యం రాసిందే ఎవరంటే ఏమో…
ఈ ప్రేమ గాయం చేసేది ఎవరంటే వివరమేది… లేదంది కాలం

కాదన్న ప్రేమ… నీడలాగా వస్తుందే
అవునన్న ప్రేమ… చేతికంది రాదే
ప్రేమల్లో పడితే.. మాయలాగా ఉంటుందే
ప్రేమల్లో చెడితే.. ప్రాణమే నిశి..

ఆగనంటూనే సాగదే… సాగనంటూనే ఆగదే
అన్ని అంటూనే మూగదే… ప్రేమకేది సాటిరాదే…

ప్రాణమెంతున్న చాలదే… జన్మలెన్నున్న మారదే
విశ్వమంతున్న ప్రేమదే… గుప్పెడంత గుండే…

ఓ..ఈ ప్రేమలే అనంతమే… ఆనందమల్లే…
ఓ..ఈ ప్రేమలే అనంతమే… ఆవేదనల్లే…

ఓ..ఓ… చిన్ని మౌనములోన…
ఎన్ని ఊగిసలో… రాసి లేని కావ్యం…
ఊసు కలపదే ప్రేమలకే.. ఊపిరిదే…

ఊహలే ఊహలే… నిను విడవవులే…
గుండెకే ప్రాణమై… పూసే పూసే…
ఊహలే ఊహలే… నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ… ఆ ఆ ఆ…

ఓ..ఈ ప్రేమలే అనంతమే… ఆనందమల్లే…
ఓ..ఈ ప్రేమలే అనంతమే… ఆవేదనల్లే…

ఓ..ఓహో… శ్రీకారమే ఆకారం
ఓంకారం ప్రేమే…

ఓ..ఓహో… అనంతమే
అనంతమే… ఇదంతా ప్రేమే…

చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెబుతుంది. ప్రేమ! ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది, దాన్ని కౌగిలించు, కంటిరెప్పల్లో దాచు.
ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. ప్రేమ కవ్విస్తుంది, కవిత్వం రాస్తుంది. ప్రేమ ఏడుస్తుంది. ప్రేమ కల్లోలంలో పడేస్తుంది. ప్రేమ కాస్తంత అర్థం అవుతుంది. ప్రేమ విరహాన్ని పెంచుతుంది. ప్రేమ విడిపోతుంది.

వెళ్లి రమ్మని ప్రేమకి తలుపు మూసినా చప్పుడవ్వని వీడుకోలు లేచి ఇవ్వు. ఒకవేళ ప్రేమ మల్లి వస్తే, దూరంగా ఆగి చూస్తే దగ్గరగా వేళ్ళు, ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు.

ప్రేమ నీ సొంతం. నీ హృదయం ప్రేమ సొంతం. మార్పులే ప్రశ్న. మార్పులే సమాధానం….
{ప్రేమ}

Jaanu Movie Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!