Jagadeka Veerudu Athiloka Sundari Lyrics

Jagadeka Veerudu Athiloka Sundari (1990)

Jagadeka Veerudu Athiloka Sundari Lyrics

అబ్బనీ తియ్యని దెబ్బ… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి
దర్శకత్వం: కె..రాఘవేంద్రరావు
నిర్మాణం: సి.అశ్వనీదత్
విడుదల తేది: 09.05.1990

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా??

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చిట పట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసి కసి వయసులో ఒక ఎద నస పదనిస కలవుగా
కాదంటునే కలబడు అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
చూస్తా… సొగసు కోస్తా… వయసు నిలబడు కౌగిట

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా??
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా

నిన్నే నావి పెదవులూ అవి నేడైనాయి మధువులూ
రెండున్నాయి తనువులూ అవి రేపవ్వాలి మనువులూ
వస్తా, వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా??
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా

అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

అందాలలో అహో మహోదయం… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి

లాలాల లా లలా లలా లలా
లాలాల ల లలా లలా లలా
లాలాల లా లలా లలా
ఉహు హు హు హుహు హుహు

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే

అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వురు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ప్రియతమా నను పలకరించు… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బందమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా…
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా…
ప్రియతమా ప్రియతమా ప్రియతమా…
ప్రియతమా నను పలకరించు ప్రణయమా

నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మ కన్నా చీరకట్టుకున్న పడుచు తనమే నాలో మురిసె
మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో
అడుగే పడక గడువే గడిచీ పిలిచే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూది పోయే శృతిలో జతిలో నిన్నేకలిపి
దేవగానమంతా ఎంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లే వచ్చీ వేద మంత్రమాయె బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చీ జానకల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బందమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా…
ప్రియతమా, ప్రియతమా, ప్రియతమా…
ప్రియతమా… నను పలకరించు ప్రణయమా
అతిధిలా… నను చేరుకున్న హృదయమా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

దినక్కుతా కసక్కురో… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, చిత్ర

దినక్కుతా కసక్కురో
ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో
ఝనక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో
ఝనక్కుతా చమక్కురో

కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురున్నై నారదున్నై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవింద గోవింద కమాన్ కమాన్ పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం

దినక్కుతా కసక్కురో
ఝనక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా… కసక్కురో
ఝనక్కుతా… చమక్కురో

వయస్సు ఒడిలో సుడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయిస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా
బ్రేకు డాన్సు షేకు డాన్సు
మిక్సు చేసి స్టెప్సు వేసి ట్రిక్స్ చేస్తే మీరు గోవిందా
కమాన్ కమాన్ డాన్స్ ఐ సే ఆడండ్రా
దినక్కుతా దినక్కుతా దినక్కుతా దినక్కుతా
దినక్కు తార దినక్కు తార దినక్కు తార తారా తారారా

దినక్కుతా… కసక్కురో
ఝనక్కుతా… చమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా
కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా… కసక్కురో
ఝనక్కుతా… చమక్కురోయ్

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

యమహో నీ యమ యమ అందం… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం
ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం

యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం

నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జ కట్టి
గుట్టుగా సెంటే కొట్టి, ఒడ్డాణాలే ఒంటీకి పెట్టి
తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టీ
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి

చీకటింట దీపమెట్టి, చీకు చింత పక్కనెట్టి
నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి
పెట్టు పోతా వద్దే చిట్టెంకీ చెయ్యి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి నువు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు నా వయసు పెనుకునే ప్రేమలలో యమహో…
నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం

పట్టె మంచమేసి పెట్టి, పాలుబెట్టి, పండు బెట్టి
పక్క మీద పూలుగొట్టి, పక్క పక్కలొళ్ళో పెట్టి

ఆకులో వక్కబెట్టి, సున్నాలెట్టి, చిలక చుట్టి
ముద్దుగా నోట్లో బెట్టి, పరువాలన్నీ పండార బెట్టి

చీర గుట్టు సారెబెట్టి సిగ్గులన్ని ఆరబెట్టి
కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటుబెట్టి

ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ
చెట్టెయ్యి సందె సీకట్లోన నన్ను కట్టేయ్యి కౌగిలింతల్లోన

ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో యమహో…
నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం

ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం

యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగాదిగా తాపం

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మన భారతంలో… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు
ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా

భాయి యో ఔర్ బెహ్ నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు

విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహా హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా
ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాట
రాజాధి రాజా మార్తాండ తేజ
నాపేరే రాజు మై నేమ్ ఈజ్ రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు
ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు
రాజు రాజు…

అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్ దా రాజు
ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు
నా పేరే రాజు

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

జై చిరంజీవా… జగదేక వీరా… లిరిక్స్

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. శైలజ

ఆ ఆ… ఆ ఆ… ఆ ఆ…
జై చిరంజీవా… జగదేక వీరా…
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
దీవించ రావయ్య వాయు సంచారా
రక్షించవేలయ్య శ్రీరామ దూత
జై చిరంజీవా…

వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా
జై చిరంజీవా…
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా…
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా
సంజీవి గిరివాహా… సానీరిసాహా…
సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా… జగదేక వీరా…

జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Lakshmi Narasimha (2004)
error: Content is protected !!