Jai Lyrics Telugu

Jai (2004)

Jai Lyrics Telugu

దేశం మనదే.. తేజం మనదే… లిరిక్స్

చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్.యన్ & కోరస్
నటీనటులు: నవదీప్ , సంతోషిణి , అయేషా జుల్కా
దర్శకత్వం: తేజ
నిర్మాణం: తేజ
విడుదల తేది: 25.03.2004

దేశం మనదే… తేజం మనదే…
దేశం మనదే… తేజం మనదే…
ఎగురుతున్న జెండా.. మనదే…
నీతి మనదే… జాతి మనదే…
ప్రజల అండదండా.. మనదే…
అందాల బంధం ఉంది ఈ.. నేలలో..
ఆత్మీయ రాగం ఉంది ఈ.. గాలిలో..
ఏ కులమైనా.. ఏ మతమైనా..
ఏ కులమైనా.. ఏ మతమైనా..
భరతమాతకొకటేలేరా..

ఎన్ని బేధాలున్నా.. మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే.. ఏకమౌతాం అంతా.. ఈ.. వేళ
వందేమాతరం.. అంటామందరం..
వందేమాతరం.. అంటామందరం..

దేశం మనదే… తేజం మనదే…
ఎగురుతున్న జెండా.. మనదే…
నీతి మనదే… జాతి మనదే…
ప్రజల అండదండా.. మనదే…
అందాల బంధం ఉంది ఈ.. నేలలో..
ఆత్మీయ రాగం ఉంది ఈ.. గాలిలో..
ఏ కులమైనా.. ఏ మతమైనా..
భరతమాతకొకటేలేరా..
రాజులు అయినా.. పేదలు అయినా..
భరతమాత సుతులే.. లేరా..

ఎన్ని దేశాలున్నా.. మాకెన్ని దోషాలున్నా..
దేశమంటే.. ప్రాణమిస్తాం అంతా.. ఈ.. వేళ
వందేమాతరం.. అంటామందరం..
వందేమాతరం.. ఓ… అంటామందరం..

వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!