Jai Chiranjeeva (2005)

Jai Chiranjeeva Lyrics

జై జై గణేశా..  జై కొడతా గణేశా… లిరిక్స్

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
గణేశ్ మహరాజ్ కి.. జై…
గణేశ్ మహరాజ్ కి.. జై…

ఓం… జై గణపతి…  జై జై జై.. గణపతి (6)

జై జై గణేశా..  జై కొడతా గణేశా..
జయములివ్వు బొజ్జగణేశా  – గణేశా..
హాయ్ హాయ్ గణేశా..  అడిగేస్తా గణేశా..
అభయమివ్వు బుజ్జిగణేశా  – గణేశా..

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి  గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా

గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా..  జై కొడతా గణేశా..
జయములివ్వు బొజ్జగణేశా  – గణేశా..
హాయ్ హాయ్ గణేశా..  అడిగేస్తా గణేశా..
అభయమివ్వు బుజ్జిగణేశా  – గణేశా..

లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ
లంబోదరా శివా సుతాయా.. లంబోదర నీదే దయ.. లంబోదర నీదే దయ

చరణం: 1
నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి..
వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి…
రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా…
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం…
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకు సోదరభావం…
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా

గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా..  జై కొడతా గణేశా..
జయములివ్వు బొజ్జగణేశా  – గణేశా..
హాయ్ హాయ్ గణేశా.. అడిగేస్తా గణేశా..
అభయమివ్వు బుజ్జిగణేశా  – గణేశా..

చరణం:  2
చందాలను అడిగిన దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ

గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా..  జై కొడతా గణేశా..
జయములివ్వు బొజ్జగణేశా  – గణేశా..
హాయ్ హాయ్ గణేశా.. అడిగేస్తా గణేశా..
అభయమివ్వు బుజ్జిగణేశా  – గణేశా..

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎక్కి  గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా

గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గణపతి
గణేశా…. గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

గణపతి బప్పా మోరియా – ఆధా లడ్డు ఖాలియా (4)

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

థంసప్ థండరుకైనా… లిరిక్స్

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహాలక్ష్మీ అయ్యర్, నిహాల్

పల్లవి:
థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా

అడిగిందడిగినట్టు ఇస్తా ఒడిలో విడిది చెయ్యనిస్తా
జతగా ఉండిపో హమేషా
ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా

చరణం: 1
కన్యాదానమిచ్చా కళ్యాణంలో కానుకిస్తా ఏకాంతంలో
కమ్ముకుంటే అమ్మో అంటానా
వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో మత్తు పెంచే మాలోకంలో
పైకి తేలే మార్గం తెలిసేనా
తెల్లారే దాకా తేలవా అల్లాడే ఆత్రం చూడవా
కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
ఈ కనికట్టేదో మానవా నన్నిట్టే కట్టే మాయవా
నీ మెలికల్లో ముడి వదిలేశాక దేఖో నా వరసా

ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా
థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా

చరణం: 2
కొంచెం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా
సోయగం నీ సొంతం చేస్తాగా
ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా స్వాగతిస్తే సింగారంగా
స్వీకరిస్తా మహదానందంగా
ముస్తాబై వచ్చా ముద్దుగా మైమరపిస్తా మరి కొద్దిగా
నువ్ సరదాపడితే సిద్ధంగానే ఉన్నాగా
గమనిస్తున్నానే శ్రద్ధగా కవ్విస్తుంటే సరికొత్తగా
పెదవేలే పదవే ఇస్తానంటే ఇదిగో వచ్చేశా
ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా

థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

హే జానా.. హే హే జానా… లిరిక్స్

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె

పల్లవి:
హే జానా.. హే హే జానా..
హే జానా.. హే హే జానా.. అందమే ఎంతున్నా
హే జానా.. హే హే జానా.. దాచుకో కొంతైనా
చీర కడితే శ్రుంగారం వోని చుడితే వయ్యారం
పొట్టి బట్టలు కట్టావో పట్ట పగలే బండారం
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం

హే జానా.. హే హే జానా.. అందమే ఎంతున్నా
హే జానా.. హే హే జానా.. దాచుకో కొంతైనా

చరణం: 1
ఆ అమ్రుతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా
ఆ అమ్రుతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా
ఆ అల్లరి ఆ అలజడి అన్నిటిలో మేమేగా
ఆ అంటె అమ్మాయీ అపురూపం మీరోయీ
అపహాస్యంగా మారొద్దులే
జబ్బ పైనా టాటూలూ జాము రేయి పార్టీలు
కట్టూబాట్లకు వీడ్కోలు కన్న వాల్లకి కన్నీల్లు

గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం

చరణం: 2
మా అశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి
మా అశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి
ఎంతెత్తుకి మీరెదిగినా ఈ నేలనే చూడాలీ
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందే త్రిల్లేముందీ టీనేజికీ
నెట్టు లోనా చాటింగూ పార్కులోనా వెయిటింగూ
మార్చుకో నీ తింకింగూ చేసి చూపు సంతింగు

గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తె ఆకారం గోధాట్లొ కలుపకు ఆచారం
చిరు చిరెత్తె యవ్వారం చీకట్లొ చెయ్యకు సంచారం

హే జానా.. హే హే జానా.. అందమే ఎంతున్నా
జా జాన జ జ జాన ఊరికే జావోనా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

కొ కొ కోడి బాగుందీ… లిరిక్స్

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, కె.ఎస్.చిత్ర

పల్లవి:
కొ కొ కోడి బాగుందీ.. కు కు కూత బాగుందీ..
కొ కొ కోడి బాగుందీ.. కు కు కూత బాగుందీ..
అందం ఆమెలా ఉందీ అదిరే ఆశ రేపిందీ
కసిగా కమ్ముకోకుంటె వయసే ఊరుకోనందీ
మూడు జాములున్న రేయి ముందరున్నదీ

కుర్ర పుంజు బాగుందీ.. కూసే కూత బాగుందీ..
దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుందీ..
ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుందీ..
బుగ్గ మీద దాని పైటా బిగుసుకున్నదీ

చరణం: 1
కొత్త కోరికేదొ గుండెలోన గుప్పుమన్నదో
మత్తు కమ్మి నిన్ను దుప్పటల్లె కప్పమన్నదో
మధన సంద్య వేలలో మాటలెందుకమ్మడు
ముద్దు పూజ మానితే మొరలు వినడె కాముడు
మొదలు పెడితె ఆగలేనె రాచ గుమ్మడు

కుర్ర పుంజు బాగుందీ.. కూసే కూత బాగుందీ..
దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుందీ..
ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుందీ..
బుగ్గ మీద దాని పైటా బిగుసుకున్నదీ

చరణం: 2
సీతకాలమైన నిన్ను తాకి వేసవైపోదా
నిన్ను చూడగానే వెన్న పూస ఊయలూగెయ్ దా
పరిమలాల తోటలో పూల పాంపు వేయనా
పట్టులాంటి గెండెనీ దిండులాగ మార్చనా
ఒక్కసారి చెయ్యి చాస్తే గులామవ్వనా

కొ కొ కోడి బాగుందీ.. కు కు కూత బాగుందీ..
అందం ఆమెలా ఉందీ అదిరే ఆశ రేపిందీ
కసిగా కమ్ముకోకుంటె వయసే ఊరుకోనందీ
మూడు జాములున్న రేయి ముందరున్నదీ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మహ ముద్దొచ్చేస్తున్నవోయ్… లిరిక్స్

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్ , శ్రేయా ఘోషల్

మహ ముద్దొచ్చేస్తున్నవోయ్ మతిపోగెట్టెస్తున్నవోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
మహ ముద్దొచ్చేస్తున్నవొయ్ మతిపోగెట్టెస్తున్నవొయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా

యమ హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నవే
బరువంత నాతో మోయిస్తావా బాలికా
కోర మీసంలో కోపం కోరుకుంటున్నా
కూడదంటానా కొరికేసినా
పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా
బైట పడతానా బ్రతిమాలినా

మహ ముద్దొచ్చేస్తున్నవోయ్ మతిపోగెట్టెస్తున్నవోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
యమ హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నవే
బరువంత నాతో మోయిస్తావా బాలికా

ఈడు గుమ్మంలో నిలబడి ఈల వేస్తున్నా
విన్నపాలేవీ వినిపించవా
ఆడ గుండేల్లో అలజడి ఆలకిస్తున్నా
ఏమి కావాలో వివరించవా
నవనవ లాడె నులుపుల్లో లేత పూత పిలిచాకా
వయసుని మించే వరదల్లో

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

తారాగణం సిబ్బంది వివరాలు:-

చిత్రం: జై చిరంజీవ (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, భూమిక, సమీరా రెడ్డి
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: వైజయంతి మూవీస్
నిర్మాణం: సి.అశ్వనీదత్
విడుదల తేది: 22.12.2005