చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రేయఘోషల్, రేవంత్
నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 12.01.2018
పల్లవి:
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
చరణం: 1
తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది
నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే
ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది
తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది
జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
కోరస్:
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
చరణం: 2
హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని
నే చూపిస్తా ఇదిగో నువ్వు అని
ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని
నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని
అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)