ఇది స్వాతి జల్లు.. లిరిక్స్
చిత్రం: జమదగ్ని(1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: మనో, జానకి
నటీనటులు: కృష్ణ , రాధ
దర్శకత్వం: భారతి రాజా
నిర్మాత: చుక్కపల్లి వేణుబాబు
విడుదల తేది: 1988
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
పెళ్ళాడే వాడా పెనవేసే తోడా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
నీ నీలి కళ్ళు అవునంటే చాలు
అల్లాడే దానా అలవాటైపోనా..
ఇది స్వాతి జల్లు
నీలి కోక నీటికి తడిసే పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో పెద్ద చిక్కు వచ్చి పడే
నీలి కోక నీటికి తడిసే పైట గుట్టు బైటపడే
పెళ్ళి కాని పిల్లకి చలితో పెద్ద చిక్కు వచ్చి పడే
కన్నె ఈడు కాగిపోయెరా…
పడిన నీరు ఆవిరాయెనా
నాలో తాకే గిలిగింతే గంతే వేసే ఇన్నాళ్ళూ
నీకై కాచే వయసంతా మల్లై పూచే
కౌగిట్లో నీ ముంత కొప్పంత
రేపేయనా తీపంత చూపేయనా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు
చిన్నదాని అందాల నడుమే సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే అందుతుంది అందుకని
చిన్నదాని అందాల నడుమే సన్నగుంది ఎందుకని
అందగాని చేతికి ఇట్టే అందుతుంది అందుకని
బుగ్గమీద సొట్ట ఎందుకే సక్కనోడి తీపి ముద్దుకే
నాకివ్వాళా సోయగాల సోకివ్వాలా
శోభనాల రేయవ్వాల యవ్వనాల హాయివ్వాలా
ఈ పూటా మన జంట చలిమంట
కాగాలిరా గిల్లంత తీరాలిరా
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు
అల్లాడే దానా అలవాటైపోనా..
ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు
వయసంది ఝల్లూ…
********** ********** ********** ********** **********
ఏలా ఇంత దూరం.. లిరిక్స్
ఏలా ఇంత దూరం.. నీవే నాకు ప్రాణం
ఏలా ఇంత దూరం.. నీవే నాకు ప్రాణం
వేర్ ఆర్ యు నౌ? యు టెల్ మీ నౌ…?
వేర్ ఆర్ యు నౌ? యు టెల్ మీ నౌ…?
వేర్ ఆర్ యు నౌ…?
ఏలా ఇంత దూరం.. నీవే నాకు ప్రాణం
చేమంతి పూదోటలో సాగే హేమంత రాగానివై
లేమంచు కవ్వింతలే రేగే నా ప్రేమ గీతిలా
దోసిళ్లలోని ఆశలన్నీ కౌగిళ్ల పూసి రాలిపోయె
నీకళ్ళలోని ఊసులన్ని నా పెళ్ళినాటి బాసలాయే..
పారాణిలా పదాలే తాకీ.. రేరాణిలా సుఖాలే పూసీ..
నీ పైటతో పదాలే రాసి ఆ పాటలో స్వరాలే పోసీ
ముద్దాడుకున్నాయి లే ప్రేమ క్రీనీడలై..
వేర్ ఆర్ యు నౌ? యు టెల్ మీ నౌ…?
వేర్ ఆర్ యు నౌ? యు టెల్ మీ నౌ…?
వేర్ ఆర్ యు నౌ…?
వేసంగి నిట్టూర్పులో ఏదో సన్నాయి పాడిందిలే
ఆషాఢ నీరెండలో పూసే సంపెంగ పూలతో
ఆకాశమంత పందిరేసి భూదేవిలాగ వాలిపోయి
అక్షింతలంటి తారలన్ని ఆనాటిదాక రాకపోయి
నీ కళ్ళలో నిషానే తీసి కౌగిళ్ళనే హుషారే చేసి
సంకెళ్ళతో సరాగాలాడి కన్నీళ్లతో వసంతాలాడి
చెల్లించుకుందాములే చేసినా బాసలే..
వేర్ ఆర్ యు నౌ? యు ఆర్ మై లవ్
వేర్ ఆర్ యు నౌ? యు ఆర్ మై లవ్
వేర్ ఆర్ యు నౌ…?
ఏలా ఇంత దూరం.. నీవే నాకు ప్రాణం
ఏలా ఇంత దూరం.. నీవే నాకు ప్రాణం
********** ********** ********** **********
కాయ్ రాజా కాయ్.. లిరిక్స్
కాయ్ రాజా కాయ్..
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్
ఒకటిస్తే రెండిస్తా జోడిస్తే ఆడిస్తా
గెలిచే లటుకు చిటుకు దారి చూపిస్తా
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్
భోగరాజు దేశంలో భోజనం లేదురా..
బోలెడంత దాచేది సంచులేరా..
ఫుడ్డుకే లాటరీ కట్టే డిగ్రీ లొద్దురా..
దేవుడికి నామాలెట్టే దేశభక్తి చూడరా..
చిల్లర డబ్బులు వేయి నీ చింతలు తీరుతాయి
అంకెల మీద ఆట ఇది లంకెబిందలాట
కలిసొస్తే ఆ నోట్లు పంచేయ్రా
తెలివుంటే అహ ఓట్లు కొనేయ్రా
మంత్రి పదవి నీదేరా మాయలోన ముంచేయ్రా
పేయ్.. మంత్రి పదవి నీదేరా మాయలోన ముంచేయ్రా
అసలు రాజనీతి అదేరా హొయ్..
కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్
ఒకటిస్తే రెండిస్తా జోడిస్తే ఆడిస్తా
గెలిచే లటుకు చిటుకు దారి చూపిస్తా
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్
మైకుపట్టి దంచేవాళ్లు మాయగాళ్లురా..
భూటకాలు నమ్మావంటే బూడిదేరా..
పేదవాడి కడుపులో పేగు ఎండుతుందిరా..
కూలివాడి కుండలో గుండె ఉడుకుతుందిరా..
ఇంకా చూస్తావేరా నీ ఢంకా కొట్టవేరా
అంకెల మీద ఆట ఇది లంకెబిందలాట
గెలవాలీ ఈ మంచి మనుషులు
నిలవాలీ ఆ సమత మమతలు
జాతి పరువు నెగ్గాలి ఖ్యాతి నీకు దక్కాలి
అహ జాతి పరువు నెగ్గాలి ఖ్యాతి నీకు దక్కాలి
అసలు సెంటరు చూసి కొట్టరా.. హోయ్..
కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా కాయ్ రాజా
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్
ఒకటిస్తే రెండిస్తా జోడిస్తే ఆడిస్తా
గెలిచే లటుకు చిటుకు దారి చూపిస్తా
కాయ్ రాజా కాయ్ కాలేజి కుర్రబ్బాయ్
వేయ్ రాజా వేయ్ అహ ఎందులైన వేయ్…
********** ********** ********** ********** **********
లగి జిగి లగి జిగి.. లిరిక్స్
హేయ్.. లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
వేగు చుక్క వెలగపండూ..
దొరికిందేమో దొండపండూ..
ఆటలోన అరటిపండు
మాటలేమో మేడిపండు
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
సుఖమే సృష్టిమూలం ధనమే దాని ప్రాణం
బ్రతుకే రాజకీయం భ్రమలే దాని మూలం
పెదవులే అందుకో కోరిన పదవులే గెలుచుకో.. రా.. రా..
గెలుపునే తలచుకో గెలిచిన మూలమే మరచిపో..
అత్తిరి బిత్తిరి జిత్తులమారి టక్కరిదానికి చిక్కావులేరా..
అత్తిరి బిత్తిరి జిత్తులమారి టక్కరిదానికి చిక్కావులేరా..
మెత్తని మాటలు నమ్మిన వాడికి నెత్తిన టోపి పెట్టాలి
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
వేగు చుక్క వెలగపండు
దొరికిందేమో దొండపండు
ఆటలోన అరటిపండూ..
మాటలేమో మేడిపండూ..
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
కనులే కలలు కాస్తే.. కలలే నిజము చేస్తే..
నిజమే నిదుర లేస్తే.. ఋజువై ఎదురు కాస్తే..
మమతలే చంపుకో కోరిన మనుగడే పెంచుకో.. రా.. రా..
పాపమే పంచుకో చీకటి లోకమే ఎంచుకో..
గుబగుబలాడే గుండెల చప్పుడు
చెప్పిన మాటలు వినిపించుకోరా..
హేయ్.. గుబగుబలాడే గుండెల చప్పుడు
చెప్పిన మాటలు వినిపించుకోరా..
ఇప్పటికైనా నిప్పుల కుంపటి
తప్పకపోతే ముప్పేరా..
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన
వేగు చుక్క వెలగపండూ..
దొరికిందేమో దొండపండూ..
ఆటలోన అరటిపండు
మాటలేమో మేడిపండు
లగి జిగి లగి జిగి లబ్బరు బొమ్మకు
రిబ్బను కడితే తందాన తానా… తందాన తానా…
జిగి లగి జిగి లగి బంగరు బొమ్మకు
ఉంగరమెడితే తానే.. తందాన తానే.. తందాన
********** ********** ********** ********** **********
ఓ మైలవ్.. లిరిక్స్
ఓ మైలవ్ బ్యూటీలోన స్వీటీ నాటీ భామ
అరె ఓ మైలవ్ నాటీగైతో భేటీ ఐతే ప్రేమ
దిరన దింతరన దింతన
విరుల దోంతరల దించనా..
వేయనా వెన్నెల వంతెనా..
ఓ మైలవ్ బ్యూటీలోన స్వీటీ నాటీ భామ
అరె ఓ.. మైలవ్
వాలేటి పొద్దుల్లోన వాటేయకుందున
నీలాటి రేవుల్లోన నీ పక్కన
మిన్నేటి వాగుల్లోన ముద్దాడమందున
తేనీటి అందంలోన వేడివ్వనా
చిలకరింతలకి చింతనం
పులకరింతలకు నర్తనం
చిలకరింతలకి చింతనం
పులకరింతలకు నర్తనం
కొనసాగనీ.. జోరుగా.. జోడుగా..
ఓ మైలవ్ నాటీగైతో భేటీ ఐతే ప్రేమ
అరె ఓ.. మైలవ్
వద్దన్నా వయసొస్తుంటే వయ్యారమివ్వనా..
దానిమ్మ పూపొత్తల్లో నే దక్కనా..
కాదన్న కౌగిల్లిస్తే కాజేయకుందునా..
చేమంతి పూలేగుచ్చి చెంగాడనా..
చలపరింతలకు చందనం
చలవరింతలకు శోభనం
చలపరింతలకు చందనం
చలవరింతలకు శోభనం
చేలరేగని వేడితో.. వాడితో..
ఓ మైలవ్ బ్యూటీలోన స్వీటీ నాటీ భామ
అరె ఓ మైలవ్ నాటీగైతో భేటీ ఐతే ప్రేమ
దిరన దింతరన దింతన
విరుల దోంతరల దించనా..
వేయనా వెన్నెల వంతెనా..
ఓ మైలవ్ బ్యూటీలోన స్వీటీ నాటీ భామ
అరె ఓ.. మైలవ్
********** ********** ********** ********** **********
రాక్షస పాలన.. లిరిక్స్
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
అది ప్రళయం కాదా.. ప్రభంజనమవదా..
ఇది దేశం కాదా.. స్వరాజ్యం లేదా..
దారుణ మారణ హింసా పాలన పోదా..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే
అధములకు పదవులు వస్తుంటే
ఎధలు పడి బతుకులు చస్తుంటే
దేశ గణము దాస్య జనము తిరగపడదా..
మనుషులను బానిసలనుకుంటే
మనుగడను బూడిద చేస్తుంటే
ప్రజలు రగిలి ప్రగతి పగిలి ప్రళయమవదా..
స్వార్థపరత్వం విద్యార్థిని బలిచేస్తే..
అధికపశుత్వం రాక్షస పాలన చేస్తే..
స్వార్థపరత్వం విద్యార్థిని బలిచేస్తే..
అధికపశుత్వం రాక్షస పాలన చేస్తే..
యువతరమే నవతరమై జనత్రయమే రణధ్వనులై
కుటిలచకిలమును కూల్చివేయదా..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
ఆశలకు ఆకలి పుడుతుంటే
దేశమును దోచుకుతింటుంటే..
కరువు పెరిగి పరువు తరిగి చీకటవదా..
గుడిసెలకు చీకటి ఉపవాసం
గుండెలకు ఆకటి పరితాపం
కడుపు రగిలి పృథివి పగిలి విళయమవదా..
బళ్ళున తుళ్ళిన అగ్ని కణాలై లేస్తే..
బగ్గున మండిన విప్లవ జ్వాలై వస్తే..
బళ్ళున తుళ్ళిన అగ్ని కణాలై లేస్తే..
బగ్గున మండిన విప్లవ జ్వాలై వస్తే..
గగనములే పగసెగలై ప్రజబలమే గజబలమై
బురితచరితములు నరికివేయదా..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
అది ప్రళయం కాదా.. ప్రభంజనమవదా..
ఇది దేశం కాదా.. స్వరాజ్యం లేదా..
దారుణ మారణ హింసా పాలన పోదా..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..
రాక్షస పాలన రక్కిన కోరల చిక్కటి నెత్తురు చూస్తే..
బగ్గున మండిన ఉగ్రత నిండిన సూర్యుడు ఎర్రగ లేస్తే..