చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహాదేవన్
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, సమంత, నిత్యా మీనన్
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి.వి.మోహన్
విడుదల తేది: 01.09.2016
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణ థోమ్ ధిరణ ధీర ధీరణాన
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణనన ధిర ధిరణ
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణ థోమ్ ధిరణ ధీర ధీరణాన
చరణం: 1
మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
చరణం:2
ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లీ ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణనన ధిర ధిరణ
థోమ్ ధిరణ థోమ్ ధిరణ ధీర ధీరణాన
********* ********* *********
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: రఘు దీక్షిత్
పల్లవి:
రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫు కింగు సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలి నేడు మనలో మనిషి
చరణం: 1
మనసిపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా
చరణం: 2
మనమంతా జీన్సు ప్యాంటు రుషులు
బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు
విన్లేదా మొదటి మనిషి కథలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగా మార్చే గుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం
********* ********* *********
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: నేహ భసిన్ , యాసిన్ నిసార్
దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
ఓహో… నీ అందం మొత్తం
ఓహో… ఒక బుక్కుగా రాస్తే ఆకాశం
ఓహో… నీ సొగసుని మొత్తం
ఓహో…. ఓ బంతిగ చేస్తే భూగోళం
దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
చరణం: 1
సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమేరా కన్ను
క్లిక్ కే కొట్టడమే మర్చిపోతుందే
స‍్పైసీ చూపులతో అట్టా చెంపలు కొరికేస్తే నువ్వు
ఐ ఫోన్ యాపిల్ సింబల్ గుర్తుస్తోందే
కాఫీడేలో విన్న సూఫీ మ్యూజిక్ లా
ఘుమ్మా ఘుమ్మందే నీ అందం ఒక్కోటీ
దేశం బోర్డర్లోని ఆసమ్ సోల్జర్లా
కాటుక కళ్ల కలలకు నువ్వే సెక్యూరిటీ
దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
చరణం: 2
సన్నా నడుమోంపుల్లోన సగమై ఆ చందమామ బల్లేగా లెప్టూ రైటూ సెటిలైందే
మేన్లీ కనుపాపల్లోన మండే ఓ ప్యూజియమా
లావా వరదల్లే చుట్టుముడుతోందే
పిల్లా నువ్వేగానీ నేపాల్లో పుట్టుంటే ఎవరెస్టు మౌంటైనైనా హీటేక్కిస్తావే
ఆడీకార్ సున్నాల్లాగా నువ్వూ నేను పెనవేస్తే
చూసే కళ్లు పట్టపగలే ఫ్లడ్ లైట్సౌతాయే
దివినుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
నువ్వు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బయిందా ఏమిటీ
********* ********* *********
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: సుఖ్వీందర్ సింగ్ , విజయ్ ప్రకాశ్
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
చరణం: 1
ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడకక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
చరణం: 2
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
********* ********* *********
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: శ్వేతా మోహన్
నీ శెలవడిగి నే కదిలెళుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సమ్మతం
********* ********* *********
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: గీతా మాధురి , సాగర్
సాకీ:
హలో హలో మైకు టెస్టింగ్ సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చికారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం
పల్లవి:
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ
తేటతెలుగులో మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు చందనం
సెల్లునంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటుబాటిలు ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబాదబాదాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనె మేళమెడతలే…
ఎందుకు? ఎందుకంటే!
నేనుపక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేనుపక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
చరణం: 1
హే వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే
లండనెల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీతదాటనే
సరుకు తోటల్లో సైకిలేసుకో
పిల్లా నీ బాడీ బల్లే బల్లే మెరిసిపోతదే
ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో
నువ్వు శానా సింపులే
ఇదేముంది శాంపులే
పాషుగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటి? ఎందుకంటే!
నేను పక్కా లోకల్ పక్కాలోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కాలోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
చరణం: 2
ప్లాస్మానా, బ్లాక్ అండ్ వైటా?
టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే
మర్పీ రేడియోను గిప్టు ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక‍్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో
టచ్చేశావమ్మడూ
నేనింతే పిల్లడూ
నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే? ఎందుకంటేహే
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్…