చిత్రం: జండాపై కపిరాజు (2014)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జావేద్ అలీ, షాశా, జి. వి.ప్రకాష్ కుమార్
నటీనటులు: నాని, అమలాపాల్, రాగిణి ద్వేది , శివబాలాజీ
దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: కె.యస్. శ్రీనివాసన్
విడుదల తేది: 21.03. 2015
ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం
అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను
జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను
ఓ ప్రేమా… ఓ ప్రేమా… నీదేలే నా జన్మ
ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం
ఓ గుండె లోతులో ఎండవేడిని
నీవు తాకగా నిండు పౌర్ణమి
నీ వరాలతోడు నాకు పూల మాసమే
ఇన్ని నాళ్ళు వేచివున్న ఇందుకోసమే
ఓ ప్రేమా… ఓ ప్రేమా… నీదేలే నా జన్మ
ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం
అసలెవరని నేనెవరని కలిశావిలా నన్ను
జత చేరగా ఇటు రమ్మని పిలిచావిలా ఎదను
ఓ ప్రేమా… ఓ ప్రేమా… నీదేలే నా జన్మ
ఇంతందంగా ఉందా లోకం
ఎటుపోయిందో మాయా మైకం