Janma Janmala Bandham (1977)

janma janmala bandham 1977

చిత్రం:  జన్మజన్మల బంధం (1977)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాతలు: యల్. భాస్కర రావు, యన్. కనక సుందర రావు
బ్యానర్: శ్రీ వెంకటరమణ పిక్చర్స్
విడుదల తేది: 28.07.1977

పల్లవి:
నింగి నేలను ప్రేమిస్తుంది… నేల గాలిని ప్రేమిస్తుంది
గాలి పువ్వును ప్రేమిస్తుంది… పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది
అలాగే ఐ లవ్ యూ…. అందుకే ఐ లవ్ యూ

తుమ్మెద పువ్వును ప్రేమిస్తుంది… పువ్వు గాలిని ప్రేమిస్తుంది
గాలి నేలను ప్రేమిస్తుంది… నేల నింగిని ప్రేమిస్తుంది
అలాగే ఐ లవ్ యూ…. అందుకే ఐ లవ్ యూ

చరణం: 1
నీలిమబ్బులో లేని మత్తు నీ వాలుకళ్ళలో ఉంది…
మెరుపుతీగలో లేని చురుకు నీ మేనివిరుపులో ఉంది…
నీలిమబ్బులో లేని మత్తు నీ వాలుకళ్ళలో ఉంది…
మెరుపుతీగలో లేని చురుకు నీ మేనివిరుపులో ఉంది…

కళ్ళతో నిను తాగేస్తోంటే… కమ్మింది ఆ మత్తు
కళ్ళతో నిను తాగేస్తోంటే… కమ్మింది ఆ మత్తు
కలలలో నిను కాజేస్తుంటే… కలిగింది ఆ మెరుపు

నింగి నేలను ప్రేమిస్తుంది… నేల గాలిని ప్రేమిస్తుంది
గాలి పువ్వును ప్రేమిస్తుంది… పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది
అలాగే ఐ లవ్ యూ…. అందుకే ఐ లవ్ యూ

చరణం: 2
కవ్వించే నీ అందానికి కలకాలం కావలి కాస్తాను..ఊ
నమ్మకుంటే నీ పెదవి అంచుపై కమ్మని బాసలు రాస్తాను
కవ్వించే నీ అందానికి కలకాలం కావలి కాస్తాను..ఊ
నమ్మకుంటే నీ పెదవి అంచుపై కమ్మని బాసలు రాస్తాను

పెదవిపైన రాసిన వ్రాతలు ఎదలో పొదగాలి
పెదవిపైన రాసిన వ్రాతలు ఎదలో పొదగాలి
ఎన్నడు వీదని జంటగా ఇలాగే నిలవాలి

నింగి నేలను ప్రేమిస్తుంది… నేల గాలిని ప్రేమిస్తుంది
గాలి పువ్వును ప్రేమిస్తుంది… పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది
అలాగే ఐ లవ్ యూ…. అందుకే ఐ లవ్ యూ
అలాగే ఐ లవ్ యూ…. అందుకే ఐ లవ్ యూ

ఐ లవ్ యూ…. ఐ లవ్ యూ
ఐ లవ్ యూ…. ఐ లవ్ యూ
ఐ లవ్ యూ…. ఐ లవ్ యూ

******  ******  ******

చిత్రం:  జన్మజన్మల బంధం (1983)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  సుశీల

పల్లవి:
నేనే.. నేను నేనే…
నేనే.. నేను నేనే…
జగతి నిండిన అందం.. నేనే
జన్మజన్మల బంధం.. నేనే
నేను ఉన్నది నీలోనే…
నేనే.. నేను నేనే…

చరణం: 1
నీ నిజం నేనే.. సగం నేనే
నీవు నేననే పదం.. నేనే
నీ నిజం నేనే.. సగం నేనే
నీవు నేననే పదం.. నేనే

నేను నువ్వై నువ్వు నేనై..
నేను నువ్వై నువ్వు నేనై.. నిలిచిపోయే మనం నేనే
నేను ఉన్నది నీలోనే….
నేనే.. నేను నేనే…

చరణం: 2
ఈ సృష్టి నేనే.. స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే
ఈ సృష్టి నేనే.. స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే

నేను నీలో నీవు నాలో…
నేను నీలో నీవు నాలో…కలిసిపోయే లయం నేనే
నేను ఉన్నది నీలోనే…

నేనే.. నేను నేనే…
జగతి నిండిన అందం.. నేనే
జన్మజన్మల బంధం… నేనే
నేను ఉన్నది నీలోనే…
నేనే.. నేను నేనే…
నేను నేనే…
నేను నేనే…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top