భలే మంచి రోజు పసందైన రోజు… లిరిక్స్
చిత్రం: జరిగినకథ (1969)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , నాగయ్య, కాంచన , జయలలిత, బేబీ రోజారమణి
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
విడుదల తేది: 04.07.1969
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు..ఆ..
వసంతాలు పూచే నేటి రోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు..ఆ..
వసంతాలు పూచే నేటి రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజూ కులదైవం పలికిన రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజూ కులదైవం పలికిన రోజు
కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిసిన రోజు
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు..ఆ..
వసంతాలు పూచే నేటి రోజు
ఆ..ఆ హాహా హాహా హా..ఆ..ఆ హాహా హాహా హా
ఆ..ఆ హాహా హాహా హా..ఆ..ఆ హాహా హాహా హా
********* ********* ********* *********
లవ్ లవ్ లవ్… లిరిక్స్
చిత్రం: జరిగినకథ (1969)
సంగీతం: గంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , నాగయ్య, కాంచన , జయలలిత, బేబీ రోజారమణి
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
విడుదల తేది: 04.07.1969
లవ్ లవ్ లవ్ మీ నిరజాన
నౌ నౌ కిస్ మీ చినదాన
సుఖములు సొగసులు అందించే ఖజానా
లవ్ లవ్ లవ్ మీ మోనగాడ
నౌ నౌ కిస్ మీ చిన్నోడా
సుఖములు సొగసులు నీవేరా రారాజా
కమాన్ నా ఆశ రమ్మంటే
గెటప్ నీ వలపు లెమ్మంది
మగసిరితో మక్కువతో మనసారా నను లాలించు
ఓహో రంగేళి నీవైతే
ఓహో రంగేళి నీవైతే
భలే కిలాడి నేనేలే
నీ పొగరు నానెవారు
నేడే ఉదయం ఊగించు