చిత్రం: జాతర (1980)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్. పి. శైలజ
నటీనటులు: చిరంజీవి, శ్రీధర్, లీలావతి, సువర్ణ, ఇంద్రాణి
దర్శకత్వం: ధవళ సత్యం
నిర్మాత: ఆర్.యస్.రామరాజు
విడుదల తేది: 1980
పల్లవి:
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…ఓ…
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…
చరణం: 1
పెళ్ళిపీఠపైన ఏ రాజు దాపునా…
చూపుచూపులోనా నూరేళ్ళ దీవన
ఆ సమయమందు నేను…
ఆ సమయమందు నేను… ఈ బిడియమోపలేను…
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
చరణం: 2
వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన…
వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన…
ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
తొలిరేయి తలపే నులివెచ్చన…
తొలిరేయి తలపే నులివెచ్చన…
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
చరణం: 3
మా ఊరు తలచుకుంటూ నీతోటి సాగనీ
నిన్ను తలచుకుంటూ నా ఊరు చేరనీ
ఈ రాకపోకలందే…
ఈ రాకపోకలందే… నను రేవు చేరుకోనీ…
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో…
******* ******** ********
చిత్రం: జాతర (1980)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
హేయ్….వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా ఈ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలె హడావిడి
ఆనందించాలీ… అది నీకే పంచాలీ…
వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలె హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ…
చరణం: 1
ఆశలు మురిపించే ఏల ఏదో ఏడి ఏదేదో ఏడి.. కోరింది జోడి
వలపు ఉయ్యాలగ మారె మన లోపల.. లోలోపలా
ఆ..ఆహా..ఆ..ఆ…హ హా..హా..
తాపము చెలరేగే వేళ నువ్వే వచ్చి
మనసే ఇచ్చి.. మది చల్లార్చాలీ
వలపు ఉయ్యాలగా మారె మన లోపల.. లోలోపలా
వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా.. నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలె హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ
చరణం: 2
దోచనా నా కోసం నీవు దాచిన సొగసు
నీ చల్లని మనసు.. నులివెచ్చని వయసు
ఈ గోదారి నా మాట ఔన్నన్నది కరిగిపొమ్మన్నదీ
ఆ..ఆహా..ఆ…హే..లా.లా..లా.లా..ఆ.. హా..హా..
చూసుకో మన ఇద్దరి జంట.. పూపొదరింట
అహ.. వలపుల పంట.. అని నేనంటా
ఈ గోదారి నా మాట ఔన్నన్నది.. కరిగిపొమ్మన్నది
వలపులు పొంగి హుషారు చేస్తే
ఉలకవా పలకవా.. నీ సొంపులే చిలకవా
ఉబికిన తలపులు భలె భలె హడావిడి
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ…
ఆనందించాలీ.. అది నీకే పంచాలీ…