Jaya Janaki Nayaka (2017)

చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్వేతా మోహన్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకూల్ ప్రీత్ సింగ్, ప్రాగ్యా జైస్వాల్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: యమ్.రవీందర్ రెడ్డి
విడుదల తేది: 11.08.2017

నువ్వేలే  నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

నడవలేని చోటులోన
పూల బాట నువ్వేలే
నేదురలేని జీవితాన
జోల పాట నువ్వేలే

నువ్వేలే  నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

మేఘలేన్నున్నా ఆకాశం నువ్వేలే
రాగాలేన్నున్నా అనురాగం నువ్వేలే
బంధాలేన్నున్నా ఆనందం నువ్వేలే
కష్టలేన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే

అలసి ఉన్న గోతులోన
మనసు మాట నువ్వేలే
అడవిలాంటి గుండెలోన
తులసికోట నువ్వేలే

నువ్వేలే  నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

ధైవలేన్నున్నా నా ధైర్యం నువ్వేలే
స్వర్గాలేన్నున్నా నా సొంతం నువ్వేలే
దీపలేన్నున్నా నా కిరణం నువ్వేలే
ఆభరణాలేన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే

మధురమైన భాషలోన
మొదటి ప్రేమ నువ్వేలే
మారమైన ఆశలోన
మరొక జన్మ నువ్వేలే

నువ్వేలే  నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన
నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే
నా లోకం నువ్వేలే
చీకట్లకు రంగులు పూసిన
స్నేహం నువ్వేలే

*********  *********  ********* 

చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కైలాష్ కెహర్

విల విల విల వాలే పొద్దుకి
రంగులు మళ్ళీ ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేలా
జల జల జల జారే కన్నుల
గంగా జలముల పరుగాగేలా
ధగ ధగ ధగ వీరుడి ఊళా

అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం
మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు
సైనికుడు
కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం
ప్రాణకవచమై రణముకు వచ్చిన రక్షకుడు
రక్షకుడు
గుండె లోతులో తెగిన గాయమై
తగువు న్యాయమై వచ్చాడు
కంచు కోటలో రాకుమారి
పెదవంచులపై చిరునవ్వవుతాడు

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే

ఆరేసావో పాతేశావో
నీ ధైర్యం వెతికిచ్చే వాడు
ఆర్చేసావో కాల్చేసావో
నీ కలలన్నీ బ్రతికించే వాడు
నువ్వు మరచిన నిన్ను మరవని
జ్ఞాపకంగ తిరిగొచ్చాడు
నిన్ను వలచిన పడమరంచు కొన
అంచున మొలచిన తూరుపు వీడు

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే

ఓ విల విల విల వాలే పొద్దుకి
రంగులు మళ్ళీ ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేలా
జల జల జల జారే కన్నుల
గంగా జలముల పరుగాగేలా
ధగ ధగ ధగ వీరుడి ఊళా

ఓ అమ్మ ఒడై ప్రేమందించి
నీ హృదయం లాలించే వాడు
ఓ బ్రహ్మ ముడై నీ సంకెలని
నీ శత్రువుని చేధించే వాడు
ముగిసి పోయిన నుదుటి రాతనే
మలుపు తిప్పు మొదలవుతాడు
సగము వెన్నెల సగము జ్వాలగా
రగిలే ప్రేమ వికిరణం వీడు

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే

error: Content is protected !!